!['మహబూబ్ నగర్ జిల్లాపై కేసీఆర్ చిన్నచూపు' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71389162921_625x300_6.jpg.webp?itok=TR3dJxrL)
'మహబూబ్ నగర్ జిల్లాపై కేసీఆర్ చిన్నచూపు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మండిపడ్డారు. సీఎం పాలమూరు పర్యటనలో ప్రతిపక్ష పార్టీ సభ్యులను కలుపుకోవకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ఎన్నికలు ఉన్నందునే వరంగల్ జిల్లాలో పర్యటించారన్న విమర్శలను తొలగించుకునేందుకే కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటన చేపట్టారని విమర్శించారు. కేసీఆర్ ను ఎంపీగా గెలిపించి రాజకీయంగా నిలబెట్టిన మహబూబ్ నగర్ జిల్లాను ఆయన చిన్నచూపే చూస్తున్నారన్నారు. కేసీఆర్ పర్యటన మహబూబ్ నగర్ టౌన్ కే పరిమితమైందన్నారు.
వాటర్ గ్రిడ్, కరెంటు కోతలు, కరవు వంటి సమస్యలు కేసీఆర్ ప్రస్తావించలేదన్నారు. సీఎం పర్యటనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల పాల్గొనవద్దన్నారు. ఆయన పర్యటన టీఆర్ఎస్ కార్యక్రమంలా సాగిందన్నారు. అభివృద్ధిలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా సీఎం కేసీఆర్ భాగస్వామ్యం చేయాలని డీకే అరుణ తెలిపారు.