జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారు?: కవిత
పవన్‌కల్యాణ్‌ను ప్రజలు ఇప్పటికే బండకేసి కొట్టారని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ‘మా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రభాకర్‌రెడ్డి 2009 నుంచి పార్టీలో ఉన్నారు. మరి జగ్గారెడ్డి ఎప్పటినుంచి బీజేపీలో ఉన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న జగ్గారెడ్డికి మీరు టికెట్ అమ్ముకున్నారని అనుకోవచ్చా?’ అని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని అంటున్నారని ప్రశ్నించగా, పవన్‌ని ఇప్పటికే ప్రజలు బండకేసి కొట్టారన్నారు.