
కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోనియా ఫోన్
మెదక్ లోక్సభ ఉప ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డితో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, డి.శ్రీనివాస్, దామోదర రాజనరసింహ, గీతారెడ్డి తదితర సీనియర్ నాయకులకు ఆమె ఫోన్లు చేశారు.
మెదక్ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందన్న వాస్తవాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆమె సీనియర్ నాయకులందరికీ చెప్పారు. కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా పార్టీ విజయం కోసం కృషి చేయాలన్నారు. ఈ విషయమై పార్టీ అభ్యర్థిని సునీత, టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యలకు ప్రత్యేక సూచనలు కూడా చేసినట్లు సమాచారం.