మెదక్ లోకసభ టికెట్ రేసులో నేనున్నా: సర్వే
మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతల్లో రేసు మొదలైంది
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతల్లో రేసు మొదలైంది. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతలు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఈ రేసులో మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పోటికి సిద్దంగా ఉన్నామంటూ అధిష్టానానికి సంకేతాలిచ్చారు.
అయితే తాజాగా మల్కాజిగిరి లోకసభ స్థానంలో ఓటమి పాలైన మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కూడా మెదక్ లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ టికెట్ రేసులో నేనున్నా అంటూ సర్వే సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. హైకమాండ్ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని మాజీ మంత్రి సర్వే అన్నారు.