హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం బుధవారం హైదరాబాద్లో ప్రకటించింది. టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించాలని సీపీఎం పిలుపునిచ్చింది. మెదక్ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.హారీష్ రావు వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలను కలసి మద్దతు కోరారు. అందుకు తమకు కొంత గడువు కావాలిని ఇరు పార్టీల నేతలు హారీష్ రావును కోరారు.
దాంతో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మెదక్ లోక్సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. అనంతరం ఆయన తెలంగాణ సీఎం పీఠం అధిష్టించిన తర్వాత మెదక్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఆ స్థానానికి ఈ నెల 13న ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.