హుజూర్‌నగర్‌ ఎన్నికతో తేలిపోయింది! | Congress Party Preparing For Municipal Polls In Telangana | Sakshi

హుజూర్‌నగర్‌ ఎన్నికతో తేలిపోయింది: పొన్నం

Dec 25 2019 5:24 PM | Updated on Dec 25 2019 6:44 PM

Congress Party Preparing For Municipal Polls In Telangana - Sakshi

పొన్నం ప్రభాకర్

సాక్షి, సిద్దిపేట: రిజర్వేషన్లు ప్రకటించకుండానే మున్సిపల్‌ ఎన్నికలకు తమ అభ్యర్థులు సిద్ధమని కేటీఆర్‌ చెప్పడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. బుధవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను మరిచిపోయిందని, హామీలు గుర్తుకు రావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో చురక పెట్టాలంటూ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా బీజేపీకి ఎప్పటికీ రాదని హుజూర్‌నగర్‌ ఎన్నికలతో తేలిపోయిందన్నారు. ఎన్నికల అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇటీవల సిద్ధిపేట డీసీపీ నరసింహరెడ్డికి తలెత్తిన పరిస్థితే.. అధికారులకు ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదని పేర్కొన్నారు. ప్రజలకు, అధికారులకు ప్రత్యామ్నాయ పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement