ఈ మీటింగ్‌ రాహుల్‌గాంధీ రావాల్సింది.. రాలేదు: ఖర్గే | We Will Come Power In Telangana Says Mallikarjun Kharge | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు

Published Fri, Sep 17 2021 10:08 PM | Last Updated on Fri, Sep 17 2021 10:14 PM

We Will Come Power In Telangana Says Mallikarjun Kharge - Sakshi

సాక్షి, గజ్వేల్: తాము అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన దళిత గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తామని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. వాటికోసం ఇప్పుడు కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. సోనియాగాంధీ వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. కేసీఆర్ ఢోకా చేశారు, ఆయనను ప్రజలు నమ్మద్దు అని సూచించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ, మోడీ పాలనలో దేశం అంధకారంలో ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో శుక్రవారం దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విలీనమైన రోజున దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించడం సంతోషమని పేర్కొన్నారు. వాస్తవంగా ఈ సభకు రాహుల్ గాంధీ రావాల్సింది, ఇతర కార్యక్రమాలతో రాలేదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement