హిట్ ఎక్కిన కామారెడ్డి... కేసీఆర్ పై పోటీకి రేవంత్ రెడ్డి | - | Sakshi
Sakshi News home page

హిట్ ఎక్కిన కామారెడ్డి... కేసీఆర్ పై పోటీకి రేవంత్ రెడ్డి

Published Sun, Nov 5 2023 12:24 AM | Last Updated on Sun, Nov 5 2023 8:20 AM

- - Sakshi

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : అంతర్గత ప్రజాస్వా మ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించి పార్టీ నాయకత్వం భారీ కసరత్తే చేసింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ ఇంకా 9 స్థానాలకు గాను మొదటి రెండు విడతల్లో 5 సీట్లకు మాత్రమే అభ్యర్థులు ఖరారు అయ్యారు. మరో 4 సీట్లకు అభ్యర్థుల ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా కామారెడ్డి నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బరిలోకి దిగడంతో పరి స్థితులు మారిపోయాయి. ఆ ప్రభావంతో నిజామాబాద్‌ అర్బన్‌ సీటు విషయంలోనూ ప్రతిష్టంభన నెలకొంది.

ఈ క్రమంలో అనేక మలుపులు, తర్జనభర్జనలు, ఊహాగానాలు, వార్తలు చోటుచేసుకున్నా యి. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం కామారెడ్డి నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని బరిలోకి దించేందుకు నిర్ణయించింది. ఈ విషయమై సుదీర్ఘ కసరత్తు చేస్తూ వచ్చారు. చివరకు ఢిల్లీ పెద్దలు రేవంత్‌ను కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి సై తం పోటీ చేయించి కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో కామారెడ్డికి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌అలీకి అర్బన్‌ టిక్కెట్టు ఖ రారు చేశారు. ఇందుకు సంబంధించి అధినాయక త్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి గాంధీ భవన్‌లో శనివారం జరిగిన ఉమ్మడి జిల్లా నాయకు ల సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా ఆదివారం నిజామాబాద్‌ నాయకులతో షబ్బీర్‌ భేటీ కానున్నారు. షబ్బీర్‌ నామినేషన్‌ విషయమై తేదీ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 7న షబ్బీర్‌ నామినేషన్‌ దాఖలు చేసే అవకాశాలున్నాయంటున్నారు. నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల 6న కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అదే విధంగా ఈ నెల 9న కామారెడ్డిలో రేవంత్‌ నామినేషన్‌ వేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది.

► నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్టు విషయమై నెలరోజులుగా అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ సీటుపై తీవ్ర ఉత్కంఠ వాతావరణం కొనసాగింది. బీసీ కోటా కింద మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ తుదివరకు తీవ్రంగా ప్రయత్నించారు. మైనారిటీ కోటాలో పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ గట్టి ప్రయత్నాలు చేశారు. చివరకు షబ్బీర్‌కు దీన్ని కేటాయించారు. ఇదిలా ఉండగా మొదట్లో ఈ స్థానం పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌కు కేటాయించారు. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో షబ్బీర్‌కు ఈ టిక్కెట్టు కేటాయించడంతో మహేష్‌కుమార్‌ గౌడ్‌కు, అధికారంలోకి వచ్చాక మొదటి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకునేందుకు హామీ ఇచ్చి అధిష్టానం బుజ్జగించింది.

ఇక బాన్సువాడ కాంగ్రెస్‌ టిక్కెట్టును ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డికి ఇవ్వనున్నట్లు సమాచారం. జుక్కల్‌ టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే సౌదా గర్‌ గంగారాం, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌, ఎన్‌ఆర్‌ఐ లక్ష్మికాంతారావు మధ్య పోటీ నెలకొంది. మొత్తానికి కేసీఆర్‌, రేవంత్‌లు పోటీపడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇదిలా ఉండ గా కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి బలంగా ఉండడంతో త్రిముఖ పోటీ తప్పనిసరి అయింది. ఇందులో ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ నెల కొంది. ఇక నిజామాబాద్‌ అర్బన్‌లోనూ బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ త్రిముఖ పోరు కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement