ఒక్కసారిగా రెచ్చిపోయిన పిచ్చికుక్కలు.. ఐదుగురికి తీవ్రగాయాలు | Telangana: Dog Attack, Five People Injured Kamareddy | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా రెచ్చిపోయిన పిచ్చికుక్కలు.. ఐదుగురికి తీవ్రగాయాలు

Published Sun, Jun 25 2023 6:09 PM | Last Updated on Sun, Jun 25 2023 7:06 PM

Telangana: Dog Attack, Five People Injured Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: మద్నూర్ మండల కేంద్రంలో పిచ్చికుక్కల దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని పిచ్చికుక్కలు ఒక్కసారిగా రెచ్చిపోయి కనిపించిన వారిపై దాడికి పాల్పడ్డాయి. ఈ క్రమంలో ఆదివారం ఏకంగా ఐదుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

కుక్కల దాడిలో గాయపడిన క్షతగాత్రుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పంచాయతీ పరిధిలో కుక్కలు బెడద ఎక్కువైందని వాటిని నివారించాలని ఇదివరకే గ్రామస్థులు పలుమార్లు పంచాయతీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అయినా అధికారుల నుంచి ఏ స్పందన రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

చదవండి: తెలంగాణకు ఎల్లో అలర్ట్‌.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement