కామారెడ్డి : చిరుత పులి మరోసారి కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ అటవీ ప్రాంతంలో నేషనల్ హైవేపై చిరుత సంచరించింది.
పులి సంచారంతో ఆందోళనకు గురైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ప్రత్యక్ష సాక్షి నుంచి వివరాలు సేకరించారు. పాదముద్రలు పరిశీలించారు. అనంతరం, పులి సంచారంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా తిరుగవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment