దత్తాశ్రమంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం | Free Cancer Screening Camp At Kamareddy Dattashram | Sakshi
Sakshi News home page

దత్తాశ్రమంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం

Published Sat, Nov 16 2024 9:22 PM | Last Updated on Sat, Nov 16 2024 9:31 PM

Free Cancer Screening Camp At Kamareddy Dattashram

సాక్షి, కామారెడ్డి: ఎస్‌సీఎస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని దత్తాశ్రమంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా మహిళలు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్నారు. హైదరాబాద్‌ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌కు చెందిన 10 మంది వైద్యుల బృందం ఈ శిబిరంలో పాల్గొన్నారు.

ఎస్‌జీఎస్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ వెంకటకృష్ణ, ఎల్ఐసీ లక్ష్మణరావు, సీతారామరావు, డాక్టర్ రాధా రమణ, శ్రీవారి భారతి చంద్రశేఖర్, డాక్టర్ ఉమారెడ్డి, డాక్టర్ రాజ్యలక్ష్మి, డాక్టర్ మాళవిక డాక్టర్ అరవింద్, డాక్టర్ పవన్, శ్రీనివాస్ తదితరులు క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ శిబిరంలో మహిళలకు పాప్ స్మెర్, మామోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement