Free cancer screening for women
-
దత్తాశ్రమంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం
సాక్షి, కామారెడ్డి: ఎస్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని దత్తాశ్రమంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా మహిళలు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్నారు. హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌కు చెందిన 10 మంది వైద్యుల బృందం ఈ శిబిరంలో పాల్గొన్నారు.ఎస్జీఎస్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ వెంకటకృష్ణ, ఎల్ఐసీ లక్ష్మణరావు, సీతారామరావు, డాక్టర్ రాధా రమణ, శ్రీవారి భారతి చంద్రశేఖర్, డాక్టర్ ఉమారెడ్డి, డాక్టర్ రాజ్యలక్ష్మి, డాక్టర్ మాళవిక డాక్టర్ అరవింద్, డాక్టర్ పవన్, శ్రీనివాస్ తదితరులు క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ శిబిరంలో మహిళలకు పాప్ స్మెర్, మామోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. -
రిమ్స్ తీరు పేలవం
ఉలవపాడు: - వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని ఒంగోలు రిమ్స్‌లో తీరు ఆందోళన కరంగా మారిందని.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఉలవపాడు వైద్యశాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఒంగోలుతో పాటు నెల్లూరు రిమ్స్‌ను గాడిలో పెట్టాల్సి ఉందన్నారు. 35 ఏళ్లు దాటిన మహిళలందరికీ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. జాతీయరహదారిపై ఉన్న వైద్యశాలల్లో ఆర్థోపెడిక్ వైద్యులను నియమిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ వెంకయ్య నాయుడు రాజ్యసభలో మాట్లాడిన తరువాతే ఈ విషయం చర్చకు వచ్చిందని చెప్పారు. ముందుగా చాకిచర్ల గ్రామంలో రూ. 68 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని , ఉలవపాడులో రూ. 3.35 లక్షలతో నిర్మించనున్న భవన పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే పోతుల రామారావు అ««దl్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, కసుకుర్తి ఆదెన్న, దారాసాంబయ్యతో పాటు జేసీ–2 ప్రకాశ్ కుమార్, ఆర్డీఓ మల్లికార్జున, ఏపీవీపీ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్, డీఎంహెచ్ఓ యాస్మిన్, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.