kamineni
రిమ్స్ తీరు పేలవం
Published Mon, Aug 1 2016 12:06 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
ఉలవపాడు:
- వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని
ఒంగోలు రిమ్స్‌లో తీరు ఆందోళన కరంగా మారిందని.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఉలవపాడు వైద్యశాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఒంగోలుతో పాటు నెల్లూరు రిమ్స్‌ను గాడిలో పెట్టాల్సి ఉందన్నారు. 35 ఏళ్లు దాటిన మహిళలందరికీ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. జాతీయరహదారిపై ఉన్న వైద్యశాలల్లో ఆర్థోపెడిక్ వైద్యులను నియమిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ వెంకయ్య నాయుడు రాజ్యసభలో మాట్లాడిన తరువాతే ఈ విషయం చర్చకు వచ్చిందని చెప్పారు. ముందుగా చాకిచర్ల గ్రామంలో రూ. 68 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని , ఉలవపాడులో రూ. 3.35 లక్షలతో నిర్మించనున్న భవన పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే పోతుల రామారావు అ««దl్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, కసుకుర్తి ఆదెన్న, దారాసాంబయ్యతో పాటు జేసీ–2 ప్రకాశ్ కుమార్, ఆర్డీఓ మల్లికార్జున, ఏపీవీపీ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్, డీఎంహెచ్‌ఓ యాస్మిన్, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement