MNJ cancer hospital
-
దత్తాశ్రమంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం
సాక్షి, కామారెడ్డి: ఎస్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని దత్తాశ్రమంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా మహిళలు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్నారు. హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌కు చెందిన 10 మంది వైద్యుల బృందం ఈ శిబిరంలో పాల్గొన్నారు.ఎస్జీఎస్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ వెంకటకృష్ణ, ఎల్ఐసీ లక్ష్మణరావు, సీతారామరావు, డాక్టర్ రాధా రమణ, శ్రీవారి భారతి చంద్రశేఖర్, డాక్టర్ ఉమారెడ్డి, డాక్టర్ రాజ్యలక్ష్మి, డాక్టర్ మాళవిక డాక్టర్ అరవింద్, డాక్టర్ పవన్, శ్రీనివాస్ తదితరులు క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ శిబిరంలో మహిళలకు పాప్ స్మెర్, మామోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. -
హైదరాబాద్ MNJ క్యాన్సర్ హాస్పిటల్లో....
-
ఆమెకు రక్ష
సాక్షి, హైదరాబాద్: సర్వైకల్ కేన్సర్ నివారణకు రాష్ట్రవ్యాప్తంగా బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో కేన్సర్ విస్తరణ, అరికట్టాల్సిన అవసరంపై ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి డాక్టర్లు ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ చేర్చాలని సూచించారు. అంతేకాదు, ప్రభుత్వ డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు సర్వైకల్ కేన్సర్ స్క్రీనింగ్‌పై తరగతులను నిర్వహించనున్నారు. కేన్సర్‌ను సులభంగా గుర్తించే (డయాగ్నైజ్) పద్ధతులపై నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలను బాధిస్తున్న రోగాల్లో సర్వైకల్ కేన్సర్ ఒకటి. మన దేశంలో ప్రతి సంవత్సరం 60 వేల మందికి పైగా ఈ కేన్సర్‌తో మరణిస్తున్నారు. ఏటా సగటున 97 వేల మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మన రాష్ట్రంలోనూ సర్వైకల్ కేన్సర్ ప్రభావం ఉంది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్‌లో భాగంగా చేపడుతున్న సర్వేలో సర్వైకల్ కేన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు 7 వేల అనుమానిత కేసులను గుర్తించారు. దీనిపై గతంలో ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి బృందాలు పలు ప్రాంతాల్లో స్క్రీనింగ్ నిర్వహించి, వ్యాధి విస్తరిస్తున్నట్లు గుర్తించాయి. సెక్సువల్ ఇన్ఫెక్షన్తో సోకే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) సర్వైకల్ కేన్సర్‌కు దారితీస్తుంది. ఈ వైరస్‌ను టీకాలతో కంట్రోల్ చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా సర్వైకల్ కేన్సర్‌ను ఎదుర్కోవాలని భావిస్తున్నారు. ఈ టీకాపై ఉన్న అపోహతో ఇప్పటివరకు ఇండియాలో ప్రవేశపెట్టలేదు. ఇటీవల ఈ టీకాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో చేర్చింది. త్వరలోనే అక్కడ వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. -
బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్ల వయోపరిమితి 65కి పెంపు
సాక్షి, హైదరాబాద్: బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్ల వయోపరిమితిని 58 నుంచి 65కి పెంచినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర ప్రకటించారు. శుక్రవారం ఏంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ న్యూ బ్లాక్ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ కొత్త మెడికల్ కాలేజీల కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ న్యూ బ్లాక్ నిర్మాణానికి అరబిందో ఫార్మా కంపెనీ రూ.20 కోట్లు విరాళం ఇవ్వడం సంతోషకరమన్నారు. దీనికి అదనంగా మరికొంత మొత్తాన్ని కలిపి అధునాతన క్యాన్సర్ బ్లాక్ నిర్మిస్తామని ఈటెల తెలిపారు. ఏంఎన్‌జే అటానమస్ విషయంపై తాము చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. -
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో యూజర్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు సేవ చేయాల్సిన ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి ఇప్పుడు వారి నుంచే యూజర్ చార్జీల పేరుతో వసూళ్లు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కేన్సర్ చికిత్సకు రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఆసుపత్రి, ఇప్పుడు వైద్యానికి డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పలువురు రోగులు గగ్గోలు పెడుతున్నారు. పైగా వివిధ పరీక్షలకు రసీదులు కూడా ఇవ్వడం గమనార్హం. మరోవైపు ఆరోగ్యశ్రీ రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాల్సి ఉండగా, వారిపై కూడా యూజర్ చార్జీల భారం వేస్తుండటం రోగులకు ఆవేదన కలిగిస్తోంది. ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వచ్చాక తిరిగి రోగులకు చెల్లిస్తామంటూ ఆసుపత్రి అధికారులు చెబుతున్నారని రోగులు అంటున్నారు. అలా ఇస్తామన్న హామీ ఎక్కడా లేదని, అక్రమాల కేంద్రంగా ఆసుపత్రి తయారైందని అంటున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు శ్రీనివాసరెడ్డి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుండి పరీక్షలకోసం యూజర్ చార్జీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తుండటాన్ని ఆయన అధికారులకు విన్నవించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో యూజర్ చార్జీలు వసూలు చేసినట్లుగా చూపుతున్న రసీదులు రూ. 2,500 వరకు వసూలు కొన్ని పరీక్షలకు రూ.100 నుంచి రూ. 1,200 వరకు వసూలు చేస్తున్నారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి పరీక్షలకు రూ. 2 వేలు, రూ. 2,500 వసూలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ రోగులకైతే డబ్బు వసూలు చేయకూడదు. పూర్తి ఉచితంగా వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి భిన్నంగా ఫీజులు భారీగా వసూలు చేయడంపై రోగులు గగ్గోలు పెడుతున్నారు. యూజర్ చార్జీలు రద్దు చేయాలని తాము కోరగా, ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు రాగానే రోగులకు తిరిగి వెనక్కి ఇస్తున్నామని ఆసుపత్రి అర్ఎం చెప్పినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొలుత వసూలు చేయడమే తప్పు, పైగా తిరిగి చెల్లిస్తున్నామని చెప్పడం కూడా వాస్తవ విరుద్ధమని ఆయన ఆరోపించారు. పైగా రోగులు ఎవరికీ డబ్బు తిరిగి చెల్లిస్తున్న పరిస్థితి లేదు. అదీగాక యూజర్ చార్జీల బిల్లులు కంప్యూటరైజ్డ్వి కాకుండా చేతిరాతతో ఇస్తున్నారు. యూజర్ చార్జీల పేరుతో వసూలైన డబ్బు పూర్తిగా దుర్వినియోగమవుతున్నదని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశాఖ అధికారులతో కుమ్మక్కై ఆసుపత్రిలో కొందరు ఈ డబ్బును దిగమింగుతున్నారన్నారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ దందాపై విచారణ జరపాలని, అక్రమ వసూళ్ళను అరికట్టాలని ఆయన కోరారు. -
కేన్సర్ అవేర్‌నెస్‌లో ఎంఎన్‌జే గిన్నీస్ రికార్డ్
సాక్షి, హైదరాబాద్: ప్రొస్టేట్ కేన్సర్‌పై ప్రచారం నిర్వహించి కేవలం గంట వ్యవధిలో 487 మందికి అవగాహన కల్పించినందుకు గుర్తింపుగా ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి అరుదైన గౌరవం లభించింది. ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఎంఎన్‌జే ఆస్పత్రికి చెందిన ప్రొస్టేట్ కేన్సర్ నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్‌లు అక్టోబర్ 26న జేబీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ప్రొస్టేట్ కేన్సర్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేవలం గంట వ్యవధిలోనే ప్రొస్టేట్ కేన్సర్ లక్షణాలు, కారణాలు, నివారణ పద్ధతులను వివరించారు. దీంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి అవగాహన కల్పించడం ఓ రికార్డు కాగా, దీన్ని గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడం కొసమెరుపు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు.. ఎంఎన్‌జే ఆస్పత్రికి రికార్డులు రావడం పట్ల వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి హర్షం ప్రకటించారు. అందుకోసం కృషిచేసిన ఎంఎన్‌జే అధికారులను ఆయన అభినందించారు. సీఎం కేసీఆర్ హర్షం.. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి రెండు ప్రపంచ రికార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి అధికారులను ఆయన అభినందించారు. మొదటిసారిగా ఇలాంటి అవార్డులు ఒక ప్రభుత్వ ఆస్పత్రికి రావడం తెలంగాణకు గర్వకారణమన్నారు. -
ఎంఎన్‌జేకు.. ‘నిర్లక్ష్యపు కేన్సర్’
సాక్షి, సిటీబ్యూరో: ‘జనగాం జిల్లా, పంచాల గ్రామానికి చెందిన సీహెచ్ నర్సయ్య ప్రొస్టెట్ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉన్న వైద్యుల సలహా మేరకు ఆయన గత పదిహేను రోజుల క్రితం చికిత్స కోసం ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి ఔట్‌పేషెంట్ విభాగానికి రాగా పరీక్షించిన వైద్యులు రక్త, మూత్ర సహా సీటీ, ఎంఆ ర్‌ఐ, ఆల్ట్రాసౌండ్, 2డిఎకో వంటి పలు పరీక్షలు చేయించాల్సిందిగా సూచించారు. వైద్యుడు రాసిన చీటీ తీసుకుని సీటీస్కాన్ విభాగానికి వెళ్లగా పేరు నమోదు చేసుకుని నాలుగు రోజుల తర్వాత రావాలన్నారు. రిపోర్ట్ కోసం మరో మూడు రోజులు వేచి ఉండాలని సూచించారు. పది రోజుల తర్వాత రిపోర్టులతో వైద్యుడిని సంప్రదించగా ..సర్జరీ చేయాల్సి ఉందని చెప్పారు. అయితే ఇప్పటికే చాలా మంది వెయింటింగ్‌లో ఉన్నందున, మరో పదిహేను రోజుల తర్వాత వస్తే అడ్మిట్ చేసుకుని సర్జరీ చేస్తామని స్పష్టం చేయడంతో..తెలిసిన వారి సహాయంతో అతికష్టం మీద పది రోజుల క్రితం ఆస్పత్రిలో అడ్మిటయ్యాడు. అయితే ఇప్పటి వరకు సర్జరీ చేయకపోగా..ప్రస్తుతం అంతా ఎలక్షన్ల బిజీలో ఉన్నారని..మరో వారం రోజుల తర్వాత వస్తే..సర్జరీ చేస్తామని చెప్పి సోమవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. చేసేది లేక ఆయన ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. అసలే ప్రొస్టేట్ కేన్సర్.. ఆపై భరించలేని నొప్పితో బాధపడుతున్న నర్సయ్యకు ఇరవై రోజులైనా..కనీస వైద్యసేవలు అందకపోవడంతో శారీరకంగానే కాకుండా మానసికంగా మరింత కుంగిపోతున్నాడు. ఇది ఒక్క నర్సయ్యకు ఎదురైన అనుభవం మాత్రమే కాదు..రొమ్ము, గైనిక్, హెడ్ అండ్ నెక్, ప్రొస్టేట్ కేన్సర్లతో బాధ పడుతూ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి చేరుకుంటున్న వందలాది మంది నిరుపేద రోగులకు ఇక్కడ నిత్యం ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. రిపోర్టుల జారీలో జాప్యం వల్లే..: ప్రతిష్టాత్మక ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిని నిర్లక్ష్యపు వైరస్ పట్టి పీడిస్తోంది. కేన్సర్ గాయాలను నయం చేసేందుకు అవసరమైన వైద్యనిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఆ గాయం రాచపుండుగా మారి శరీరమంతా విస్తరిస్తుంది. నిరుపేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న ఉన్నతాధికారులు సంబంధిత విభాగాల పనితీరును గాలికొదిలేసి సచివాలయం, మంత్రి పేషీ చుట్టు తిరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1955లో అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా 40 పడకల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఆస్పత్రి 1996లో స్వయం ప్రతిపత్తి పొందింది. ప్రస్తుతం 450 పడకలు, 15 విభాగాలకు విస్తరించింది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు జిల్లాల రోగులు కూడా వస్తున్నారు. ప్రస్తుతం సర్జరీ విభాగంలో మూడు యూనిట్లు ఉండగా, మూడు ఆపరేషన్ టేబుళ్లు మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రిలో వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ...సీటీ, ఎంఆర్ఐ రిపోర్టుల జారీలో జరుగుతున్న జాప్యం కారణంగా వారు కూడా సకాలంలో చికిత్సలు అందించలేని దుస్థితి. బాధితుల్లో 80 శాతం మంది వ్యాధి తీవ్రత ముదిరిన తర్వాతే ఆస్పత్రికి వస్తుంటారు. తీరా ఆస్పత్రికి వచ్చిన తర్వాత రిపోర్టులు, చికిత్సల్లో జరుగుతున్న జాప్యంతో వ్యాధి మరింత ముదిరి మృత్యువాత పడుతున్నారు. సీటీ, ఎంఆర్ఐ మిషన్‌తో కేన్సర్ గడ్డలను గుర్తించి సకాలంలో రిపోర్టులను జారీ చేయాల్సిన సంబంధిత విభాగం అధిపతి పరిపాలన విభాగంలో కీలకమైన పోస్టులో కొనసాగుతుండటం, సదరు విభాగంపై పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. బతికుండగానే నరకం: ఆస్పత్రిలో ఏటా 12000 కొత్త కేసులు నమోదవుతుండగా, సుమారు లక్ష వరకు పాత కేసులు ఉంటాయి. ప్రస్తుతం ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 500 మందికిపైగా వస్తుండగా, ఇన్‌పేషంట్లుగా మరో 600 మంది చికిత్స పొందుతుంటారు. ఆస్పత్రిలో ఏటా పది వేల కొత్త కేసులు నమోదవుతుండగా, మరో 11 వేల మంది పాల్అప్ చికిత్సల కోసం వస్తుంటారు. ఇక్కడ ఏటా 1500పైగా మేజర్ సర్జరీలు, 1000పైగా మైనర్ చికిత్సలు జరుగుతుంటాయి. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేనందున రేడియో, కీమోథెరపీల కోసం వస్తున్న నిరుపేద రోగులు వార్డుల బయట, చెట్లకింద గడపాల్సి వస్తోంది, మరికొందరు ఆర్థికంగా భారమైనా విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌కు వెళ్లిపోతున్నారు. అసలే ఎముకలు కొరికే చలి ఆపై కేన్సర్‌తో అనేక మంది రోగులు బతి కుండగానే నరకం చూస్తున్నారు. ఆస్పత్రిలో ఐదు రేడియో థెరపీమెషిన్లు ఉండగా, వీటిలో ఇప్పటికే రెండు మూలన పడ్డాయి. మూడు పని చేస్తుండగా వీటిలో ఒకటి 18 ఏళ్ల క్రితం కొనుగోలు చేయగా, మరొకటి 13 ఏళ్ల క్రితం కొనుగోలు చేసినది కావడం గమనార్హం. రోగుల తాకిడి దృష్ట్యా ఆయా మిషన్లు రోజంతా పని చేయాల్సి వస్తుండటంతో తరచూ సాంకేతికలోపాలు తలెత్తుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో 209 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 209 వైద్యుల పోస్టులు, ఇతర పారామెడికల్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అందులో 173 పారామెడికల్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా, 36 వైద్యుల పోస్టులను డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించింది. 173 పారామెడికల్ పోస్టుల్లో అధికంగా 85 స్టాఫ్ నర్సు పోస్టులున్నాయి. 16 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు, 10 ల్యాబ్ అటెండెంట్, 10 థియేటర్ అటెండెంట్, 10 రేడియోగ్రాఫర్ గ్రేడ్–2 పోస్టులున్నాయి. 36 వైద్యుల పోస్టుల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్, లెక్చరర్ పోస్టులున్నాయి. -
వన్ డే సీపీ ఇషాన్
‘సమయం మధ్యాహ్నం మూడు గంటలు. గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సందడి నెలకొంది. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రవేశద్వారం వద్ద కోలాహలం కనిపించింది. అంతలోనే పోలీసు కమిషనర్ కారులో సీపీ డ్రెస్‌లో ఉన్న ఓ బాలుడు దిగాడు. మహేశ్ భగవత్ పుష్పగుచ్ఛం ఇచ్చి అతనికి స్వాగతం పలికారు. ఆరుగురు సాయుధ పోలీసులు ఆయుధాలతో గౌరవ వందనం చేశారు.భగవత్ ఆ చిన్నారిని మూడో అంతస్తులోని తన చాంబర్‌కు తీసుకెళ్లి అక్కడున్న ఆయన సీటులో కూర్చొబెట్టాడు. అతను నవ్వుతూ తన చేతిలోని కమిషనర్ కర్రను తిప్పుతూ అందరినీ చూస్తూ ఉండిపోయాడు’. ఏంటీ ఇదంతా చూస్తుంటే రాచకొండ పోలీసు కమిషనర్‌గా కొత్తగా వచ్చిన వ్యక్తికి మహేశ్ భగవత్ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు అనిపిస్తుందా.. అయితే చదవండి. సాక్షి, సిటీబ్యూరో/రాయదుర్గం: విషయమేమిటంటే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ నగరంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ జిల్లా, కూచన్‌పల్లికి చెందిన ఆరేళ్ల బాలుడు దూదేకుల ఇషాన్. తన కోరికను నెరవేర్చేందుకు మహేష్ భగవత్ ‘వన్ డే పోలీసు కమిషనర్’గా అవకాశం కల్పించారు. పోలీసు ఆఫీసర్ కావాలన్న అతడి కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులు శశిచంద్ర, ప్రియాజోషి సీపీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కుర్రాడి మోములో ఆనందం చూశారు. ఒకరోజు రాచకొండ కమిషనర్‌గా ఎలా అనిపిస్తుందని మీడియా ఇషాన్‌ను ప్రశ్నించగా ‘భహుత్ కుష్ హూ’ అని నవ్వుతూ తెలిపాడు. అందరితో కరచలనం చేస్తూ ఎంతో సంతోషంగా చేతిలోని కర్రను తిప్పుతున్న దృశ్యాన్ని చూసిన అతని తల్లిదండ్రులు చాంద్‌పాషా, హసీనా కన్నీటి బాష్ఫాలు రాల్చారు. కోరిక తీరిందిలా... మెదక్ జిల్లా కూచన్‌పల్లిలో వాల్‌పేయింటింగ్ చేస్తూ జీవనం సాగించే దూదేకుల చాంద్‌పాషా, హసీనా దంపతులకు ముగ్గురు సంతానం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సోఫియా మూడో తరగతి, ఇషాన్ రెండో తరగతి చదువుతున్నారు. ఐదేళ్ల తహసీన్ ఇంటివద్దే ఉంటుంది. భార్య హసీనా బీడీలు చుడతారని తెలిపాడు. చిన్నతనం నుంచే పోలీసు అవుతానని చెప్పే ఇషాన్‌కు బ్లడ్ క్యాన్సర్ ఉందని తేలడంతో తమకు దిక్కుతోచడం లేదన్నాడు. నగరంలోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో చేర్పించామని, వైద్యులు బాగానే చికిత్స చేస్తున్నట్లు తెలిపాడు. ఇదే సమయంలో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ సభ్యులు తమ పిల్లాడి కోరికను తెలుసుకొని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ దృష్టికి తీసుకొచ్చి నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. ఒకరోజు సీపీతో మహేశ్‌భగవత్ సంభాషణ మహేశ్‌భగవత్: కైసా లగ్రే... ఇషాన్...? ఇషాన్: అచ్చా లగ్రా... హ.. హ.. హ..(నవ్వుతూ..) మహేశ్‌భగవత్: క్యాకరింగే పోలీస్ ఆఫీసర్ బన్కే ? ఇషాన్: లా అండ్ ఆర్డర్‌కు కంట్రోల్ కర్తా.. మహేశ్‌భగవత్: ఔర్ క్యా కరేగా.. ? ఇషాన్: చోరోంకో పకడ్కే జైల్ మే దాలూంగా.. ఔర్ సిగరేట్ పీనేవాలోంకో, గుట్కా కానేవాలోంకో జైల్‌మే దాలూంగా. మహేశ్‌భగవత్: ఔర్తోం కో క్యాకరేగా.. ? ఇషాన్: ఔరతోంకో ముష్కిల్ పైదా కర్నే వాలోంకో జైల్‌మే దాల్కే మార్తా మహేశ్‌భగవత్: ఔరతోంకో కైసా హెల్ప్ కర్తే.. ? ఇషాన్: నవ్వుతూ.. నైమాలూమ్... త్వరగా కోలుకోవాలి ఇషాన్‌కు ఆరేళ్లకే క్యాన్సర్ వ్యాధి సోకడం చాలా బాధగా ఉంది. బాలుడు త్వరగా కోలుకోవాలి. మేక్ ఏ విష్ సంస్థ ప్రతినిధులు కలిసి బాలుడి కోరిక వివరించగా వెంటనే అం గీకరించాను. క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స బాగా సాగుతోందని, తల్లిదండ్రులు కూడా చికిత్స తీరుపట్ల సంతృప్తిగా ఉన్నారు. విద్యార్థులు, యువకులు పోలీసులు, పోలీస్ ఆఫీస ర్లు కావాలనే కోరికను నెరవేర్చుకోవాలన్నారు. ఇప్పుడిప్పుడే చాలా మందికి పోలీసులమై ప్రజలకు న్యాయం చేయాలనే భావన కలుగుతోందన్నారు. –సీపీ మహేశ్‌భగవత్ -
ఎంఎన్జెకు రూ.14 కోట్లతో రేడియేషన్ యంత్రం
హైదరాబాద్: నగరంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రికి రూ.14 కోట్ల విలువైన రేడియేషన్ యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2013లోనే ఈ యంత్రం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు గుర్తు చేస్తూ కొనుగోలులో ఏడాదికిపైగా జాప్యం జరిగిందన్నారు. దీని కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమంటే ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. -
ఎంఎన్‌జే ఆసుపత్రికి 100 వైద్య పోస్టులు
పడకల సంఖ్య 500కు పెంచుతూ సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి అదనంగా 100 వైద్య, ఇతర పారామెడికల్ పోస్టులు మంజూరు చేస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. అలాగే పడకల సంఖ్యను 250 నుంచి 500 పెంచుకునేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సంబంధిత ఫైలును సీఎం ఆమోదానికి పంపించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటకలకు కీలకంగా ఉన్న ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి రోజూ 500 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఏడాదికి లక్ష మంది ఫాలోఅప్ వైద్యానికి వస్తారు. దీంతో ఆసుపత్రిలో పడకల సంఖ్య, వైద్య సిబ్బంది ఏమాత్రం సరిపోవడంలేదు. ఫలితంగా రోగులకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎన్‌జే డెరైక్టర్ జయలత పంపిన ప్రతిపాదనల మేరకు పడకల సంఖ్యను రెండింతలు పెంచేందుకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్... ప్రస్తుతం ఆసుపత్రిలో 266 వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. పడకల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరుగుతుండటంతో అదనంగా 288 పోస్టులు అవసరమని డెరైక్టర్ జయలత ప్రభుత్వానికి విన్నవించారు. అయితే వాటిల్లో 100 పోస్టులనే మంజూరు చేసినట్లు చెబుతున్నారు. అందులో 50 డాక్టర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. మిగిలిన 50 పోస్టుల్లో నర్సులు, రేడియో థెరపిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టులున్నాయి. సీఎం ఆమోదం తెలపగానే వీటికి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అనంతరం వాటిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని జయలత ‘సాక్షి’కి తెలిపారు. ఈ పోస్టులను వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగం భర్తీ చేయనుంది. పరిపాలనా పరమైన పోస్టులను ప్రజారోగ్య విభాగం భర్తీ చేయనుంది. కాగా, కేన్సర్ ఆసుపత్రికి రాష్ట్ర బడ్జెట్లో రూ.28 కోట్లు కేటాయించారు. పడకల సంఖ్య పెరిగితే ఆ బడ్జెట్‌ను రూ.50 కోట్లు పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రికి ఏడాదికి రూ.12 కోట్లు వస్తుంది. -
అంధకారంలో ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో అంధకారం అలుముకుంది. మంగళవారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం వరకు కరెంటు లేకపోవటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ శస్త్రచికిత్సలు, స్కానింగ్ యంత్రాలు నిలిచిపోయాయి. విద్యుత్ అంతరాయానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
ఎంఎన్జేలో క్యాజువాల్టీ వార్డు
కేన్సర్ ఆస్పత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సాక్షి, హైదరాబాద్: ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో క్యాజువాల్టీ వార్డు ఏర్పాటైంది. ఆస్పత్రి చరిత్రలో తొలిసారిగా నాలుగు పడకలతో దీన్ని ఏర్పాటుచేశారు. ‘నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై స్పందించిన ప్రభుత్వం ఆస్పత్రి అవుట్పేషంట్ బ్లాక్‌లో నాలుగు పడకల సామర్థ్యంతో ఓ క్యాజువాల్టీ వార్డును కూడా ఏర్పాటు చేసింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో తీవ్ర దోపిడీకి గురై, ఇక తమ వల్ల కాదంటూ ఏ గాంధీ ఆసుపత్రికో, ఉస్మానియాకో తమ ఆస్పత్రుల నుంచి బలవంతంగా పంపించేస్తున్న రోగులకు క్యాజువాల్టీలో సేవలు అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించింది. వార్డులన్నీ తిరిగిన మంత్రి... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం ఉదయం ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలు, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ఓపీ బ్లాక్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాజువాల్టీ సహా ఓపీ బిల్డింగ్‌పై కొత్తగా నిర్మించిన ఇన్‌పేషంట్స్ వార్డు తదితర విభాగాల్లో కలియతిరిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ జయలత ఆస్పత్రిలోని పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆస్పత్రికి కావాల్సిన వైద్య పరికరాలు, ఇతర అవసరాలపై ప్రతిపాదనలు తయారు చేసి పంపాల్సిందిగా మంత్రి ఆమెకు సూచించారు. త్వరలో బ్లడ్ కాంపోనెంట్ సెపరేట్ మిషన్ ఆస్పత్రికి వారం రోజుల్లో ‘బ్లడ్ కాంపోనెంట్ సెల్ సెపరేట్ మిషన్’ను అందిస్తామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. లాండ్రీ, కిచెన్ కోసం అధునాతన భవనాలు నిర్మిస్తామన్నారు. శిథిలావస్థకు చేరినపాత భవనాన్ని ఆధునీకరించి రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తామని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అక్కడే ఉన్న టీఎస్ఎంఐడీసీ అధికారులకు మంత్రి ఆదేశించారు. విద్యు త్ సరఫరాలో హెచ్చు తగ్గులను నివారించేందుకు మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని వైద్యులు కోరగా, తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ఓపీబ్లాక్ రెండో అంతస్తులో కొత్తగా నిర్మించిన ఇన్‌పేషంట్ వార్డులో అవసరమైన వెంటిలేటర్లు, సెంట్రల్ ఆక్సిజన్ సిష్టం, పడకలు,ఇతర అవసరాలు సమకూర్చి రోగులకు అందుబాటులోకి తెస్తామన్నారు. మంత్రి వెంట నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, డీఎంఈ డాక్టర్ రమణి, తదితరులు ఉన్నారు. -
‘డాక్టర్ కన్నన్ విషయం కేసీఆర్‌కు చెబుతా’
నాంపల్లి: ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ కన్నన్ వ్యవహరిస్తున్న తీరును సీఎం కేసీఆర్‌కు వివరిస్తానని డిప్యూటీ సీఎం టి.రాజయ్య అన్నారు. మంగళవారం రాజయ్యను రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి ఆహ్వానించి టీఎన్జీఓ క్యాన్సర్ ఆసుపత్రి ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం సీమాంధ్రకు చెందిన క్యాన్సర్ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ కన్నన్ను వెంటనే తొల గించాలని వారు మంత్రికి ఓ నివేదికను సమర్పించారు. తెలంగాణ ఉద్యోగులపై పక్షపాత ధోరణి అవలంభిస్తూ తీవ్ర ఇబ్బందుల కు గురిచేస్తున్నారని ఆరోపించారు.