ఎంఎన్జెకు రూ.14 కోట్లతో రేడియేషన్ యంత్రం
Published Tue, Jan 3 2017 11:14 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
హైదరాబాద్: నగరంలోని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రికి రూ.14 కోట్ల విలువైన రేడియేషన్ యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2013లోనే ఈ యంత్రం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు గుర్తు చేస్తూ కొనుగోలులో ఏడాదికిపైగా జాప్యం జరిగిందన్నారు. దీని కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమంటే ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.
Advertisement