
సాక్షి, హైదరాబాద్: బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్ల వయోపరిమితిని 58 నుంచి 65కి పెంచినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర ప్రకటించారు. శుక్రవారం ఏంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ న్యూ బ్లాక్ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ కొత్త మెడికల్ కాలేజీల కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ న్యూ బ్లాక్ నిర్మాణానికి అరబిందో ఫార్మా కంపెనీ రూ.20 కోట్లు విరాళం ఇవ్వడం సంతోషకరమన్నారు. దీనికి అదనంగా మరికొంత మొత్తాన్ని కలిపి అధునాతన క్యాన్సర్ బ్లాక్ నిర్మిస్తామని ఈటెల తెలిపారు. ఏంఎన్‌జే అటానమస్ విషయంపై తాము చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment