సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 209 వైద్యుల పోస్టులు, ఇతర పారామెడికల్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అందులో 173 పారామెడికల్ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా, 36 వైద్యుల పోస్టులను డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించింది.
173 పారామెడికల్ పోస్టుల్లో అధికంగా 85 స్టాఫ్ నర్సు పోస్టులున్నాయి. 16 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు, 10 ల్యాబ్ అటెండెంట్, 10 థియేటర్ అటెండెంట్, 10 రేడియోగ్రాఫర్ గ్రేడ్–2 పోస్టులున్నాయి. 36 వైద్యుల పోస్టుల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్, లెక్చరర్ పోస్టులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment