మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు ఫర్జా్జన బేగం(ఫైల్)
బెజ్జూర్ (ఆదిలాబాద్): రెండ్రోజుల క్రితం వైద్యం అందక సులుగుపెల్లి గ్రామానికి చెందిన సరిత మృతి చెందిన ఘటన మరువక ముందే మరో నిండు గర్భిణి ప్రాణాలు గాల్లో కలిశాయి. బెజ్జూర్ మండలం ఎల్కపెల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఫర్జాన బేగం(28) సకాలంలో వైద్యం అందక సోమవారం మృతి చెందింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న పార్జన బేగంను కుటుంబీకులు ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది పరీక్షించారు. బ్లీడింగ్ అవుతోందని, సమయానికి డాక్టర్ అందుబాటులో లేడని సిర్పుర్(టి) ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని కుటుంబీకులకు చెప్పారు.
దీంతో కుటుంబీకులు ప్రభుత్వ వాహనంలో సిర్పూర్ ఆసుపత్రిలో తీసకెళ్లారు. అక్కడి వైద్యులు రక్తం మడుగులో ఉన్న గర్భిణిని పరీక్షించి.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. వెంటనే వారు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు సైతం తమతో కాదని కరీంనగర్ కు తీసుకెళ్లాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. అంతలోనే ఆరోగ్య పరిస్థితి విషమించి ఫర్జాన బేగం మృతి చెందిది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందితే ఫర్జాన బతికేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment