govenament hospital
-
ఉస్మానియాలో కలకలం: డ్యూటి డాక్టర్ నెత్తిన పడిన ఫ్యాన్
-
పాజిటివ్ బాధితుల ‘పడక’ పాట్లు..!
కోవిడ్ బారిన పడ్డ హన్మకొండకు చెందిన రాజారావుకు నాలుగు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో సంప్రదిస్తే జనరల్ బెడ్లు తప్ప ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు అందుబాటులో లేవు. దీంతో రాజారావు కొడుకు 60 కిలోమీటర్ల దూరాన ఉన్న తొర్రూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. కూకట్‌పల్లికి చెందిన జి.అనసూయకు రెండ్రోజులుగా ఆక్సిజన్ స్థాయిలు 91కి పడిపోయాయి. ఆక్సిజన్ పెట్టించాలని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రుల్లో ప్రయత్నించినా ఎక్కడా బెడ్ అందుబాటులో లేదు. దీంతో దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని ఓ ఆస్పత్రిలో బెడ్ దొరకడంతో అడ్మిట్ చేశారు. రోజుకు రూ.40వేల చొప్పున బెడ్ చార్జీలు చెల్లిస్తున్నట్లు సమాచారం. సాక్షి, హైదరాబాద్: సెకండ్ వేవ్‌లో కరోనా సోకిన వారు నిర్లక్ష్యం చేస్తే తీవ్రఇబ్బందులు పడుతున్న ఘటనలు అనేకం. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే గొంతు, ఊపిరితిత్తులు, పొట్టలో తీవ్ర ప్రభావాన్ని చూపి అనారోగ్య సమస్యలను వేగంగా పెంచుతోంది. దీంతో బాధితులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ చెబుతున్నా.. మెరుగైన వైద్యం దొరుకుతుందన్న ఉద్దేశంతో రోగులు ముందుగా ప్రైవేట్ వైపు చూస్తున్నారు. బెడ్ల కొరత... రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 54,832. వైద్యా రోగ్య శాఖ గణాంకాల ప్రకారం వీరిలో 28,825 (52.55 శాతం) మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 50.5 శాతం మంది ఆక్సిజన్ బెడ్లపై ఉండగా.. 29.47 శాతం మంది ఐసీయూ ల్లో ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని కరోనా బెడ్ల సంఖ్య ప్రకారం.. యాక్టివ్ కేసులన్నింటిలో 96 శాతం మందిని ఆస్పత్రిలో చేర్పించొచ్చు. అంతేకాదు ఈ బెడ్లలో సగం ఖాళీగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ చెబుతోంది. కానీ ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం బెడ్లు ఖాళీగాలేవంటూ బాధితులను తిప్పిపంపిస్తున్నాయి. గత్యంతరంలేక కొందరు ఆక్సిజన్ సిలిండర్లు బుక్ చేసుకుని ఇంటివద్దే ఊపిరి పీలుస్తుండగా.. మరికొందరు ఆస్పత్రుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక, ప్రాణవాయువు దొరక్క మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వసతుల్లేకనే ‘ప్రైవేట్’కు... కోవిడ్ బారినపడుతున్న వారిలో ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కోవిడ్ చికిత్స కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టిమ్స్ (తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను ఏర్పాటు చేసింది. ఇందులో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఆస్పత్రి ప్రారంభించి ఏడాది కావొస్తున్నా.. రక్త పరీక్ష చేసే పరిస్థితి లేదు. సమీపంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు నమూనాలను పంపి పరీక్షలు చేయిస్తున్నారు. ఇలా సరైన వసతులు లేకపోవడంతోనే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నట్లు పలువురు చెబుతున్నారు. సగం బెడ్లు ఖాళీగా ఉన్నాయట... రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల లభ్యతను ప్రజలకు వివరించాలని హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా బెడ్ అవైలబిలిటీ డాష్‌బోర్డును ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వారీగా మొత్తం పడకలు, భర్తీ అయినవి, ఖాళీగా ఉన్నవి... అనే వివరాలను ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని కేటగిరీల్లో ఉన్న బెడ్లు 53,782. వీటిలో 28,825 బాధితులతో భర్తీ కాగా, 24,957 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లోని బెడ్లలో 46.4 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు డాష్‌బోర్డు సమాచారం చెబుతోంది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 46.22 శాతం ఖాళీగా ఉండగా... ప్రైవేట్ ఆస్పత్రుల్లో 46.47 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. బెడ్ అవైలబులిటీ డాష్‌బోర్డు ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రై వేటు ఆస్పత్రుల్లో బెడ్ల పరిస్థితి ఇది మొత్తం భర్తీ ఖాళీ శాతం జనరల్ బెడ్లు... ప్రభుత్వ 5,473 1,228 4,245 77.56 ప్రైవేట్ 15,884 4,534 11,350 71.45 ఆక్సిజన్ బెడ్లు.. ప్రభుత్వ 7,560 5,311 2,249 29.74 ప్రైవేట్ 13,425 9,257 4,168 31.04 ఐసీయూ బెడ్లు ప్రభుత్వ 2,170 1,636 534 24.60 ప్రైవేట్ 9,270 6,859 2,411 26.00 ఇన్ని ఆంక్షలెందుకు...? వైద్య,ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన డాష్‌బోర్డు సమాచారం ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు సగం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో బెడ్లు ఖాళీగా ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితుల రాకపై ఆంక్షలు విధించడం, రాష్ట్రంలో కోవిడ్ బారిన పడ్డ వారు హోం ఐసోలేషన్‌లో మాత్రమే ఉండాలని సూచించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. (చదవండి: England: లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలా..వద్దా!) -
కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణం చోటుచేసుకుంది. కరోనాతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని తరలించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గంటలతరబడి వార్డులోనే మృతదేహం ఉండడంతో పేషంట్ల తో పాటు బంధువులు భయాందోళనకు గురయ్యారు. జగిత్యాల జిల్లా వెంకట్రావుపేటకు చెందిన వ్యక్తి కరోనా బారినపడి కరీంనగర్ ఆస్పత్రిలో చేరారు. వైద్యం పొందుతూనే ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని తరలించకుండా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కనీసం మార్చురీకి తరలించకుండా వార్డులోనే గంటల తరబడి మృతదేహాన్ని ఉంచడంతో పేషంట్లతో పాటు వారి బంధువులు భయాందోళన చెందారు. పేషెంట్లు, మృతుడి బంధువులు నిలదీస్తే అంబులెన్స్ లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఉదయం చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని నాలుగు గంటలకు పైగా వార్డులో ఉంచడంతో, స్థానికులను భయాందోళనకు గురి చేసింది. కరోనా ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్న తరుణంలో వైద్య సిబ్బంది మృతదేహం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం కలకలం సృష్టించింది. చివరకు అధికారులు జోక్యంతో హడావిడిగా వైద్య సిబ్బంది అప్రమత్తమై మృతదేహాన్ని బంధువులకు అప్పగించి తరలించారు. చదవండి: కరోనా కట్టడిపై లేఖ రాసిన వైద్య, లాయర్ల బృందం -
ఆస్పత్రి నిర్లక్ష్యం.. ప్రసవం కాకుండానే బిడ్డనిచ్చారు
హుజూరాబాద్ రూరల్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో అప్పుడే జన్మించిన శిశువును తల్లికి కాకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి మరో మహిళకు అప్పగించారు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన రజిత ప్రసవం కోసం హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఆడశిశువుకు జన్మనివ్వగా కింది స్థాయి సిబ్బంది రచన అనే మహిళ కుటుంబ సభ్యులకు అందజేశారు. కానీ రచనకు ఇంకా ఆపరేషన్ జరగలేదు. ఆపరేషన్ అనంతరం రజిత వద్ద పాప లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వెంటనే వైద్యసిబ్బంది అప్రమత్తమై రచన కుటుంబ సభ్యుల వద్ద నుంచి పాపను తీసుకొచ్చి రజిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. పాప మరొకరికి ఎలా ఎలా అప్పగిస్తారంటూ రజిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రజిత కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ మాట్లాడుతూ కింది స్థాయి సిబ్బంది మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందని, శిశువును తిరిగి తల్లికి అప్పగించామని తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: బాలుడి దారుణ హత్య -
కోతకైనా సిద్ధం. ..సర్కారీ ఆస్పత్రి నిషిద్ధం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలామంది గర్భిణులు సిజేరియన్‌కే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కొందరు గర్భిణులు సాధారణ ప్రసవాలకు అంగీకరించడంలేదు. పురుటి నొప్పుల సమయంలో పరిస్థితి చేజారిపోతున్నా సాధారణ ప్రసవమే చేద్దామని ప్రభుత్వ వైద్యు లు చేస్తున్న ఒత్తిడే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొన్నిచోట్ల ప్రసవాలు చేసే లేబర్ రూంలు సరిగా లేకపోవడం, కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని వైద్య వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలపై గర్భిణులు, వారి కుటుంబసభ్యులు ఆందోళ చెందుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సాధారణ ప్రసవం చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీన్నే ఆసరాగా తీసుకొని ప్రైవేటు ఆసుపత్రులు అవసరమున్నా లేకపోయినా సిజేరియన్ ద్వారానే బిడ్డను బయటకు తీస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనే కనిపిస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవాలు చేస్తే మంచిదేనని, కానీ గర్భిణీలను మానసికంగా సిద్ధం చేయకుండా ఒత్తిడి చేస్తే ప్రయోజనం ఉండదని వైద్యులు అంటున్నారు. దీంతో ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య ఒకట్రెండు శాతం తగ్గిందని వైద్య విధాన పరిషత్‌లోని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఏడాది 3.83 లక్షల మంది ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3.83 లక్షల మంది శిశువులు జన్మించారు. అందులో 2.18 లక్షల (57%) మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 1.65 లక్షల (43%) మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో జన్మించారు. గతేడాది ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటి సంఖ్య ఒకట్రెండు శాతం అధికంగా ఉందని, ఇప్పుడు తగ్గిందని అంటున్నారు. ఇక ఇప్పటివరకు జరిగిన ప్రసవాల్లో మొత్తంగా 59% సిజేరియన్ ద్వారా ప్రసవాలు చేశారు. అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాల్లో 45%, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాల్లో 78% సిజేరియన్ ద్వారా జరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి పంపిన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో గర్భిణులు జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవం అంటేనే హడలిపోతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించా యి. సాధారణ ప్రసవానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం రూ. 25 వేలతో ముగించేయవచ్చు. అదే సిజేరియన్ ఆపరేషన్ చేసినందుకు, వారం పది రోజులపాటు ఆస్పత్రిలో అద్దె గదుల్లో ఉంచినందుకు ఆస్పత్రి స్థాయిని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. -
వైద్యం అందక గర్భిణి మృతి
బెజ్జూర్ (ఆదిలాబాద్): రెండ్రోజుల క్రితం వైద్యం అందక సులుగుపెల్లి గ్రామానికి చెందిన సరిత మృతి చెందిన ఘటన మరువక ముందే మరో నిండు గర్భిణి ప్రాణాలు గాల్లో కలిశాయి. బెజ్జూర్ మండలం ఎల్కపెల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఫర్జాన బేగం(28) సకాలంలో వైద్యం అందక సోమవారం మృతి చెందింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న పార్జన బేగంను కుటుంబీకులు ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది పరీక్షించారు. బ్లీడింగ్ అవుతోందని, సమయానికి డాక్టర్ అందుబాటులో లేడని సిర్పుర్(టి) ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని కుటుంబీకులకు చెప్పారు. దీంతో కుటుంబీకులు ప్రభుత్వ వాహనంలో సిర్పూర్ ఆసుపత్రిలో తీసకెళ్లారు. అక్కడి వైద్యులు రక్తం మడుగులో ఉన్న గర్భిణిని పరీక్షించి.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. వెంటనే వారు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు సైతం తమతో కాదని కరీంనగర్ కు తీసుకెళ్లాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. అంతలోనే ఆరోగ్య పరిస్థితి విషమించి ఫర్జాన బేగం మృతి చెందిది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందితే ఫర్జాన బతికేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు
వేంపల్లె: గిడ్డంగివారిపల్లె సమీపంలో కూలీలతో వెళ్లే ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలతోపాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో వెళ్తున్న సయ్యద్ సర్ఫద్దీన్, వైఎస్ మదీనాపురానికి చెందిన సయ్యద్ ఖాసీంబీ, షేక్ మాబున్నీతోపాటు డ్రైవర్ పఠాన్ ఇస్మాయిల్‌కు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని వైఎస్ఆర్సీపీ నాయకులు, వార్డు మాజీ మెంబర్లు కదిరుల్లా, గుజరీ దర్బార్, కె.కె.ఖాన్ తదితరులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.