ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు | auto accident four members injured | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు

Published Sun, Oct 30 2016 1:06 AM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

auto accident four members injured

వేంపల్లె: గిడ్డంగివారిపల్లె సమీపంలో కూలీలతో వెళ్లే ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలతోపాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో వెళ్తున్న సయ్యద్‌ సర్ఫద్దీన్, వైఎస్‌ మదీనాపురానికి చెందిన సయ్యద్‌ ఖాసీంబీ, షేక్‌ మాబున్నీతోపాటు డ్రైవర్‌ పఠాన్‌ ఇస్మాయిల్‌కు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, వార్డు మాజీ మెంబర్లు కదిరుల్లా, గుజరీ దర్బార్, కె.కె.ఖాన్‌ తదితరులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement