దొమ్మేరు-కొవ్వూరు ఈజీకే రోడ్డులో గురువారం కారును క్వారీ లారీ ఎదురుగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
కొవ్వూరు రూరల్ :దొమ్మేరు-కొవ్వూరు ఈజీకే రోడ్డులో గురువారం కారును క్వారీ లారీ ఎదురుగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన సమయంతుల పుల్లారావు బుధవారం దేవరపల్లి మండలం గోపాలపురం బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం షాపింగ్ నిమిత్తం కారులో కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి బయలుదేరారు.
దొమ్మేరు-కొవ్వూరు ఈజీకే రోడ్డులో పెట్రోల్ బంకు సమీపంలో కొవ్వూరు వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న పుల్లారావు ఆయన కుటుంబ సభ్యులైన భ్రమరాంబకు తీవ్ర గాయాలయ్యాయి. అదే కారులో ఉన్న కుమారి, పద్మావతి అనే మహిళలతో పాటు ఇద్దరు చిన్నారులు రేఖ, పుష్ప స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికులు 108లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పట్టణ ఎస్సై ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి కేసు నమోదు చేశారు.