లారీ ఢీకొని సైక్లిస్టు మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని సైక్లిస్టు మృతి

Sep 4 2015 5:43 PM | Updated on Aug 30 2018 3:56 PM

మద్యం మత్తులో ఉన్న ఓ లారీ డ్రైవర్ అతి వేగంగా వాహనాన్ని నడిపి ఓ సైక్లిస్టు ప్రాణాన్ని బలితీసుకున్నాడు.

కొవ్వూరు (పశ్చిమగోదావరి) : మద్యం మత్తులో ఉన్న ఓ లారీ డ్రైవర్ అతి వేగంగా వాహనాన్ని నడిపి ఓ సైక్లిస్టు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆడికిరేవుల ఏటిగట్టు వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఆడికిరేవుల గ్రామానికి చెందిన వడ్డెర మేస్త్రి వానపల్లి నాగభూషణం(60) సైకిల్‌పై పక్కనే ఉన్న కుమారదేవం గ్రామానికి వెళుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement