పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని రోడ్డు కం రైల్వే వంతెనపై శనివారం ఆటోను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని రోడ్డు కం రైల్వే వంతెనపై శనివారం ఆటోను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడుకు చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి స్వగ్రామం నుంచి దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని మేరీమాత ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.