కొవ్వూరు :గోదావరిపై ఉన్న ఆర్‌స రైల్వే వంతెనపై రెండో రైల్వే లైన్ వేయనున్నారు. ఆర్చ్ రైలు వంతెనపై ఎడమవైపు మరో ట్రాక్ వేసేందకు అవకాశం ఉంది. ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ మేనేజర్ అశోక్‌కుమార్ ప్రకటించారు. రానున్న ఆరు నెలల్లో పనులు ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేయాలనేది లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు వచ్చాయని వెల్లడించారు. గోదావరిపై కొవ్వూరు-రాజమండ్రి మధ్య ప్రస్తుతం రెండు రైల్వే లైన్లు ఉన్నాయి. 1974లో ప్రారంభించిన రోడ్డు కం రైలు వంతెనపై ఒకటి, 1997లో ప్రారంభమైన ఆర్చ్ రైలు వంతెనపై మరోటి ఉన్నాయి. ఆర్‌చ వంతెనను రెండు రైల్వే వేసేందుకుగాను నిర్మించారు. ఎట్టకేలకు ఈ వంతెనపై రెండో లైన్ వేసేందుకు రైల్వేస్ సిద్ధమైంది.
మార్చనున్న ఆర్చ్ రైలు వంతెన ఆరు హేంగర్‌లు
ఆర్చ్ రైలు వంతెన 19వ స్పాన్‌లోని ఒక దీనాహేంగర్ వంగింది. పదో స్పాన్‌లోని ఏడో హేంగర్‌కూ మరమ్మతులు చేయాలని బుధవారం పరిశీలించిన నిపుణుల బృందం గుర్తించింది. మొత్తం ఆరు హేంగర్‌లను మార్చాల్సి ఉందని అశోక్‌కుమార్ తెలిపారు. ఇందుకు సుమారు రూ.కోటి వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా దశలవారీగా హేంగర్లను మారుస్తామని, రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని డీఆర్‌ఎం చెబుతున్నారు.
ఈ వంతెనపై ఇది మూడో అలజడి
ఆర్చ్ రైలు వంతెన 27వ పిల్లర్‌కు, డెక్ బేరింగ్‌కు మధ్య అంచనాలకు మించి 2003లో ఎక్కువగా కదలికలు వచ్చాయి. దీంతో వంతెన స్వరూపంలో తేడా కనిపించడంతో అప్పట్లో బేరింగ్‌లను సర్దుబాటు చేశారు. 2011లో వంతెనకు ప్రకంపనలు ఎక్కువగా వస్తున్నాయని రైల్వే వర్గాలు గుర్తించాయి. పరిశీలించిన రైల్వే ఇంజినీరింగ్ నిపుణుల ట్రాక్‌లో లోపాలే దానికి కారణమని తేల్చింది. తాజా ఇప్పుడు 19వ స్పాన్ వద్ద దీనా హేంగర్ వంగింది. ఆరు హేంగర్లను మార్చాలని గుర్తించారు. దీని కారణంగా వంతెనపై రైళ్ల వేగాన్ని 20 కిలోమీటర్లకే పరిమితం చేశారు.
ఆర్చ్ వంతెనపై రెండో రైల్వే లైన్
Published Fri, Aug 7 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement