Arch railway bridge
-
అద్భుతం సృష్టించిన భారతీయ రైల్వే
కౌరి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌కి సంబంధించిన ఆర్చ్ నిర్మాణం సోమవారం పూర్తయిందని భారతీయ రైల్వేస్ ప్రకటించింది. దీంతో వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, ఒక్క ఏడాదిలో వంతెన నిర్మాణం సంపూర్ణమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయను ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు రూ. 1486 కోట్లు ఖర్చయ్యాయి. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులో భాగంగా 1.315 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు మరో రెండున్నరేళ్లలో పూర్తికానుందని ఉత్తర రైల్వే జీఎం అశుతోష్ గంగల్ చెప్పారు. తాజాగా పూర్తి చేసిన ఆర్చ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతమన్నారు. ప్రధాని మోదీ విజన్‌తో స్ఫూర్తి పొందిన రైల్వేస్ తాజా నిర్మాణంతో భారత్‌ను అత్యున్నతంగా నిలిపిందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇది ఒక అద్భుతమన్నారు. వంతెన ప్రత్యేకతలు ► పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జ్ 35 మీటర్ల ఎత్తులో ఉంది. చీనాబ్ నదీ ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ► 2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మధ్యలో 2009లో నిలిచిపోయాయి. ► 2017 నుంచి వంతెనపై ఆర్చ్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ ఆర్చ్ పొడవు 467 మీటర్లు, బరువు 10619 మెట్రిక్ టన్నులు. ► 28660 మెట్రిక్ టన్నుల ఇనుము, 66వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వాడారు. ► 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. ► నిర్మాణంలో ‘టెక్లా’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డిటైలింగ్ చేశారు. నిర్మాణంలో వినియోగించిన స్టీల్ –10 నుంచి + 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలదు. -
ఆర్చ్ వంతెనపై రెండో రైల్వే లైన్
కొవ్వూరు :గోదావరిపై ఉన్న ఆర్స రైల్వే వంతెనపై రెండో రైల్వే లైన్ వేయనున్నారు. ఆర్చ్ రైలు వంతెనపై ఎడమవైపు మరో ట్రాక్ వేసేందకు అవకాశం ఉంది. ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ మేనేజర్ అశోక్‌కుమార్ ప్రకటించారు. రానున్న ఆరు నెలల్లో పనులు ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేయాలనేది లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు వచ్చాయని వెల్లడించారు. గోదావరిపై కొవ్వూరు-రాజమండ్రి మధ్య ప్రస్తుతం రెండు రైల్వే లైన్లు ఉన్నాయి. 1974లో ప్రారంభించిన రోడ్డు కం రైలు వంతెనపై ఒకటి, 1997లో ప్రారంభమైన ఆర్చ్ రైలు వంతెనపై మరోటి ఉన్నాయి. ఆర్చ వంతెనను రెండు రైల్వే వేసేందుకుగాను నిర్మించారు. ఎట్టకేలకు ఈ వంతెనపై రెండో లైన్ వేసేందుకు రైల్వేస్ సిద్ధమైంది. మార్చనున్న ఆర్చ్ రైలు వంతెన ఆరు హేంగర్లు ఆర్చ్ రైలు వంతెన 19వ స్పాన్‌లోని ఒక దీనాహేంగర్ వంగింది. పదో స్పాన్‌లోని ఏడో హేంగర్కూ మరమ్మతులు చేయాలని బుధవారం పరిశీలించిన నిపుణుల బృందం గుర్తించింది. మొత్తం ఆరు హేంగర్లను మార్చాల్సి ఉందని అశోక్‌కుమార్ తెలిపారు. ఇందుకు సుమారు రూ.కోటి వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా దశలవారీగా హేంగర్లను మారుస్తామని, రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని డీఆర్ఎం చెబుతున్నారు. ఈ వంతెనపై ఇది మూడో అలజడి ఆర్చ్ రైలు వంతెన 27వ పిల్లర్‌కు, డెక్ బేరింగ్‌కు మధ్య అంచనాలకు మించి 2003లో ఎక్కువగా కదలికలు వచ్చాయి. దీంతో వంతెన స్వరూపంలో తేడా కనిపించడంతో అప్పట్లో బేరింగ్లను సర్దుబాటు చేశారు. 2011లో వంతెనకు ప్రకంపనలు ఎక్కువగా వస్తున్నాయని రైల్వే వర్గాలు గుర్తించాయి. పరిశీలించిన రైల్వే ఇంజినీరింగ్ నిపుణుల ట్రాక్‌లో లోపాలే దానికి కారణమని తేల్చింది. తాజా ఇప్పుడు 19వ స్పాన్ వద్ద దీనా హేంగర్ వంగింది. ఆరు హేంగర్లను మార్చాలని గుర్తించారు. దీని కారణంగా వంతెనపై రైళ్ల వేగాన్ని 20 కిలోమీటర్లకే పరిమితం చేశారు. -
ఆ హేంగర్.. అమ్మో డేంజర్
పరిశీలించిన నిపుణుల బృందం కొవ్వూరు: రాజమండ్రి - కొవ్వూరు మధ్య గోదావరిపై ఉన్న ఆర్చ్ రైలు వంతెనపై 19వ స్పాన్ వద్ద ఆర్చ్‌కి, వంతెనకి మధ్య ఉన్న డైనా హేంగర్ వంగిపోయింది. గత నెల 26వ తేదీన ఇది వంగినట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. బుధవారం లక్నో నుంచి వచ్చిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ధదరయా, సుతార్లు వంతెనను క్షుణ్ణంగా పరిశీలించారు. సాయంత్రం విశాఖపట్నం నుంచి రైల్వే అడ్వయిజరీ బోర్డు నుంచి వచ్చిన ఎన్కే సిన్హా బృందం వంగిన డైనా హేంగర్‌ను పరిశీలించింది. రైళ్లు వెళ్లే సమయంలో వంతెన ప్రకంపనలను వారు పరిశీలించారు. వంతెన పటిష్టతను దృష్టిలో ఉంచుకుని రైళ్ల వేగాన్ని 20 కిలోమీటర్లు కుదించామని డీఆర్ఎం అశోక్‌కుమార్ తెలిపారు.