ఆ హేంగర్.. అమ్మో డేంజర్ | A team of experts review to henger | Sakshi
Sakshi News home page

ఆ హేంగర్.. అమ్మో డేంజర్

Published Thu, Aug 6 2015 2:55 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

ఆ హేంగర్.. అమ్మో డేంజర్

ఆ హేంగర్.. అమ్మో డేంజర్

పరిశీలించిన నిపుణుల బృందం
కొవ్వూరు: రాజమండ్రి - కొవ్వూరు మధ్య గోదావరిపై ఉన్న ఆర్చ్ రైలు వంతెనపై 19వ స్పాన్ వద్ద ఆర్చ్‌కి, వంతెనకి మధ్య ఉన్న డైనా హేంగర్ వంగిపోయింది. గత నెల 26వ తేదీన ఇది వంగినట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. బుధవారం లక్నో నుంచి వచ్చిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ధదరయా, సుతార్‌లు వంతెనను క్షుణ్ణంగా పరిశీలించారు. సాయంత్రం విశాఖపట్నం నుంచి రైల్వే అడ్వయిజరీ బోర్డు నుంచి వచ్చిన ఎన్‌కే సిన్హా బృందం వంగిన డైనా హేంగర్‌ను పరిశీలించింది. రైళ్లు వెళ్లే సమయంలో వంతెన ప్రకంపనలను వారు పరిశీలించారు. వంతెన పటిష్టతను దృష్టిలో ఉంచుకుని రైళ్ల వేగాన్ని 20 కిలోమీటర్లు కుదించామని డీఆర్‌ఎం అశోక్‌కుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement