ఔరంగబాద్ ఇసుక ర్యాంపు మూసివేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ర్యాంపు గేటు ఎదుట పడవల నిర్వాహకులు ధర్నాకు దిగారు.
పశ్చిమ గోదావరి (కొవ్వూరు) : ఔరంగబాద్ ఇసుక ర్యాంపు మూసివేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ర్యాంపు గేటు ఎదుట పడవల నిర్వాహకులు ధర్నాకు దిగారు. ర్యాంపును సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం సాయంత్రం వరకు తెరవకుండా ర్యాంపు నిర్వాహక సంఘ మహిళా సంఘం అధ్యక్షురాలు కల్పన ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
లారీలు లోడింగ్ విషయంలో తాను నిర్దేశించిన సీరియల్ ప్రకారమే లోడింగ్ చేయాలని ఆంక్షలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు లోడింగ్‌కి ఆలస్యం కాకుండా ఉండేందుకు ఎక్కడ ఇసుక నిల్వలు సిద్ధంగా ఉంటే ఆ గుట్టలు లోడ్ చేయాలని కోరుతున్నామని పడవల నిర్వహకులు తెలిపారు.