కొవ్వూరు (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మరతాడరం గ్రామంలో తండ్రిని హత్య చేసిన కేసులో కుమారుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు... దొమ్మెరతాడరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గత నెల 28న తాగి ఇంటికి వచ్చాడు. దాంతో తని భార్య, కొడుకు గొడవపడ్డారు. ఆవేశంలో కొడుకు లావరాజు సైకిల్ ట్యూబుకు గాలికొట్టే పైపుతో తండ్రిని కొట్టడంతో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.
కాగా ఈ ఘటనపై మృతుని భార్య టెంకాయల పీచు తీస్తుండగా గునపం గుచ్చుకుని మృతిచెందాడని కొవ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోస్టుమార్టం నివేదికలో గునపం దిగిన ఆనవాళ్లు లేవని వైద్యులు తేల్చి చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేశారు. కొడుకు ఆవేశంలో కొట్టడం వల్లే ఇనుప పైపు గుండెలో గుచ్చుకుని నాగేశ్వరరావు మృతిచెందాడని నిర్ణయానికి వచ్చిన పోలీసులు లావరాజును అరెస్ట్ చేశారు. తప్పుడు ఫిర్యాదు ఇచ్చినందుకు గాను మృతుని భార్యపై కూడా కేసు పెట్టారు.
తండ్రి హత్య కేసులో కుమారుడి అరెస్ట్
Published Tue, Sep 1 2015 5:14 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement
Advertisement