గోదారిలో.. కొంగుల ముడి
కొవ్వూరు రూరల్ : వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన జంటలు తమ బంధానికి గోదారమ్మ ఆశీస్సులనూ పొందే అవకాశమే సరిగంగ స్నానం. 'పన్నెండేళ్లకు నీకో పుష్కర సంరంభం..నిండునూరేళ్లు గుబాళించాలి మా దాంపత్య సౌరభం' అని ఆకాంక్షిస్తూ పుష్కరాల్లో సరి గంగ స్నానాలు చేస్తున్న జంటలెన్నో. సోమవారం వీఐపీ ఘాట్‌లో సరిగంగ స్నానానికి సిద్ధమౌతున్న నవదంపతుల్ని చిత్రంలో చూడొచ్చు.