గోదారి పరవళ్లు
4,27,022 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి..
నెమ్మదిస్తున్న వరద
డెల్టాకు నీటి విడుదల భారీగా పెంపు
కొవ్వూరు: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువున నీటిమట్టాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో దిగువనున్న ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం ఆనకట్టకు నాలుగు ఆర్మ్‌లు వద్ద ఉన్న 175 గేట్లున మీటర్లున్నర ఎత్తులేపి 4,27,022 క్యూసెక్కుల వరదను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. శనివారం సాయంత్రం ఆనకట్ట వద్ద నీటిమట్టం 8.90 అడుగులుగా నమోదైంది.
తగ్గుతున్న నీటిమట్టాలు
కాళేశ్వరంలో 5.44 మీటర్లు, పేరూరులో 8.04 మీ, దుమ్ముగూడెంలో 8.50 మీ, భద్రాచలంలో 29.30 అడుగులు, కూనవరంలో 10.66 అడుగులు, కుంటలో 5.60 మీటర్లు, పోలవరంలో 9.80 మీటర్లు, రోడ్డు కం రైలు వంతెన వద్ద 14.71 మీటర్లు చొప్పున నమోదయ్యాయి. సోమవారం సాయంత్రానికి వరద ఉదృతి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.