ఆధార్ అనుసంధానం అంటూ మోసం
Published Fri, Aug 26 2016 1:40 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
కొవ్వూరు : ఆధార్ నంబరును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలని చెప్పి ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకుని సొమ్ములు కాజేసిన ఘటన కొవ్వూరులో గురువారం జరిగింది. కొవ్వూరుకు చెందిన మాజీ కౌన్సిలర్ యాళ్ల మార్కండేయులు తనయుడు వై.సి.హెచ్.తాతాజీకి ఓ అజ్జాత వ్యక్తి గురువారం సాయంత్రం ఫోన్ చేశారు. హిందీలో మాట్లాడి ఏటీఎం కార్డుపై ఉన్న కొన్ని నంబర్‌లు చెప్పి చివరి నంబర్ చెప్పాలని, మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేయాలని చెప్పాడు. దీంతో ఏటీఎం కార్డుపై ఉన్న చివరి నంబర్లు చెప్పిన కొద్ది సేపటికే తన ఆంధ్రాబ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము డ్రా అవుతున్నట్టు మేసేజ్‌లు రావడంతో ఆయన కంగుతిన్నాడు. ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున నాలుగు సార్లు డ్రా అయినట్టు మెసేజ్‌లు వచ్చాయి. ఐదోసారి రూ.1,100 డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నారు.
Advertisement