సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: దళితులపై అత్యాచారాలు,హత్యలు అంటూ ఈనాడులో ప్రచురించిన వార్తలపై హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు.దళితులకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని తానేటి వనిత స్పష్టం చేశారు. దళితులకు అత్యధిక భద్రత కల్పిస్తుంది కూడా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని హోంమంత్రి మరోసారి గుర్తు చేశారు.
‘దళితులపై దాడులు జరిగిన ఘటనలకు సంబంధించి వెను వెంటనే చర్యలు తీసుకున్నాం. బాధితులకు న్యాయం జరిగేలా చేసాం. ఈ విషయాలు ఈనాడుకు పట్టవా... వాటిని ఎందుకు ప్రచురించడం లేదు?, చంద్రబాబు హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయి అప్పుడు దళితులపై జరిగిన దాడులకు సంబంధించి పచ్చ మీడియా ఎందుకు ప్రశ్నించలేదు. టిడిపి హయాంలో దళితులపై దాడులకు సంబంధించి రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. దళితులను అన్ని రకాలుగా ఆదుకున్నది సీఎం జగనన్నే అని చెప్పడంలో సందేహమే లేదు.
రాజకీయంగా ,సామాజికంగా ఎన్నో అవకాశాలు కల్పించారు. దళితులకు అత్యధిక భద్రతను కల్పిస్తుంది కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. నాలాంటి సాధారణ దళిత మహిళలకు రాష్ట్ర హోం మంత్రిగా అవకాశం కల్పించింది జగనన్నే. టిడిపి హయాంలో దళితులకు హోం మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలి. ఒకటి రెండు సంఘటన బూచిగా చూపించి వైఎస్సార్ సీపీకి దళితులను దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.అది ఎప్పటికీ సాధ్యం కాదు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment