రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్లు, భవనాల శాఖపై సీఎం సమీక్షించారు. విజయవాడ కనకదుర్గ వారధిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. దుర్గగుడికి వచ్చే యాత్రికుల వల్ల పనులు నిలుపుదల చేస్తున్నామని, జనవరి నెలాఖారుకు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లనూ కూడా పూర్తిచేయాలని సీఎం కోరాగా, డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.