రోడ్లు, భవనాల శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
► మంత్రి తుమ్మల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రభుత్వ పరంగా చేపట్టే పలు భారీ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకే అప్పగించినందున సిబ్బంది అవసరం ఉందని, ఇప్పటికే 106 ఏఈ పోస్టుల భర్తీకి సీఎం అనుమతించారన్నారు.
శనివారం రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఈఎన్‌సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, సీఈ చంద్రశేఖర్‌రెడ్డితో సమీక్షించారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు, ఆడిటోరియం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉన్నందున అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.