ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేరు: తుమ్మల | thummala nageswar rao fired on opposition party's | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేరు: తుమ్మల

Published Fri, Dec 2 2016 2:40 AM | Last Updated on Thu, Aug 30 2018 5:57 PM

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేరు: తుమ్మల - Sakshi

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేరు: తుమ్మల

సాక్షి, హైదరాబాద్:  గత ఎన్నికల వాగ్దా నాలు నిలబెట్టుకుని మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యే దిశగా ముందుకు సాగుతున్నా మని, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎవరి తరం కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలన పూర్తరుున నేపథ్యంలో గురు వారం రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మరో ఏడు జాతీయ రహదారులకు అనుమతి
కేంద్రం కొత్తగా ఏడు జాతీయ రహదారులకు అనుమతినిచ్చిందని మంత్రి తుమ్మల చెప్పారు. వాటి వివరాలను విడుదల చేశారు.  మన్నెగూడ- కొడంగల్-కర్ణాటక సరిహద్దు వరకు 72 కి.మీ. రోడ్డుకు రూ.359.27 కోట్లు, కల్వకుర్తి-మల్లేపల్లి సెక్షన్, 47 కి.మీ., రూ.319.23 కోట్లు, జడ్చర్ల కల్వ కుర్తి సెక్షన్, 47.35 కి.మీ., రూ.314.53 కోట్లు, జనగామ- తిరుమలగిరి సెక్షన్, 39.18 కి.మీ., రూ.196.51 కోట్లు, తిరుమలగిరి- సూర్యాపేట సెక్షన్, 43.78 కి.మీ., రూ.244.54 కోట్లు, నకిరే కల్-తానంచెర్ల 71.6 కి.మీ., రూ.615.02 కోట్లు, హగ్గరి-జడ్చర్ల రోడ్డులో మరికల్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రూ.218 కోట్లు, ఎన్‌హెచ్ 63లో జైపుర్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రూ.228 కోట్లు, మహబూబ్‌నగర్ పట్టణ పరిధిలో డ్రెరుున్‌‌స ఏర్పాటుకు రూ.31 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement