ఉద్యమస్ఫూర్తితో మెుక్కలు నాటాలి
-
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం
-
అభివృద్ధిని ఓర్వలేకనే విపక్షాల విమర్శలు
-
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
కోల్‌బెల్ట్ : హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలని రో డ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రా వు అన్నారు. భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలోని మంజూర్‌నగర్ సింగరేణి ఆసుపత్రి ఆవరణలో గురువారం ఆయన మెుక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేం దుకే సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మిషన్ కాకతీయ, భగీరథ పనులపై అవగాహన లేని నాయకులు అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని, ఇది చూసి ఓర్వలేని ప్ర తిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతం గా మార్చేందుకే కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. సింగరేణి సహకారంతో భూపాలపల్లి ప్రాంతంలో అత్యధికంగా మొక్కలను నాటామన్నారు. అనంతరం సింగరే ణి అధికారి కర్ణ అధికారులతో పర్యావరణ ప్రతి జ్ఞ చేయించారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్య, నగర పంచాయతి చైర్‌పర్సన్ బండారి సంపూర్ణరవి, టీబీజీ కేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం, ఎస్‌ఓటుజీ ఎం సయ్యద్ హబీబ్ హుస్సేన్, ఏజంట్‌లు బళ్లా రి శ్రీనివాసరావు, మనోహర్, ఏజీఎం అప్పారావు, పర్సనల్ మేనేజర్‌లు శ్యాంసుందర్, తిరుపతి, నాయకులు కొక్కుల తిరుపతి, కటకం స్వామి, పైడిపల్లి రమేష్, ఐలయ్య పాల్గొన్నారు. హరితహారంపై నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలకు ఆసుపత్రి సిబ్బంది స్వర్ణలత, సంజయ్ బహుమతులందజేశారు.