AP CM YS Jagan Review Meeting On Roads And Buildings Department - Sakshi
Sakshi News home page

AP: రాష్ట్ర చరిత్రలో ఇంత డబ్బు ఎప్పుడూ ఇవ్వలేదు: సీఎం జగన్‌

Published Mon, Feb 14 2022 12:10 PM | Last Updated on Mon, Feb 14 2022 5:39 PM

CM YS Jagan Review on Roads And Buildings Department - Sakshi

సాక్షి, అమరావతి: రోడ్లు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర‍్వహించారు. కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌.. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2205 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఇచ్చిన సందర్భం ఎప్పుడూ లేదన్నారు. 

ఇప్పటివరకూ 83 శాతం రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని అధికారులు తెలపగా, నెలఖరు నాటికి 100 శాతం టెండర్లు పూర్తవుతాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

  •  గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదన్న సీఎం
  •  తర్వాత వర్షాలు బాగాపడ్డంతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయన్న సీఎం.
  • ఈ ప్రభుత్వం హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్టుగా వక్రీకరించి, ఒక ముద్రవేసి విష ప్రచారం చేస్తున్నారు: సీఎం
  •  గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2205 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఇచ్చిన సందర్భం ఎప్పుడూ లేదు: సీఎం
  • ఒక ఏడాదిలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత డబ్బు ఇవ్వలేదు, ఖర్చు చేయలేదు: సీఎం
  •  మే చివరి నాటికి దాదాపుగా రోడ్లు నిర్మాణం, మరమ్మతుపనులు పూర్తిచేస్తామన్న అధికారులు.
  • 33 ఆర్వోబీలు చాలా కాలంగా పెడింగ్‌లో ఉన్నాయన్న అ«ధికారులు.
  • ఈ ప్రభుత్వం హయాంలోనే ఇవి పూర్తికాలేదన్న రీతిలో కథనాలు ఇస్తున్నారు: సీఎం
  • వీటిని పూర్తిచేయడానికి సుమారు రూ.571.3 కోట్లు ఖర్చు చేస్తున్నాం: సీఎం

విశాఖ బీచ్‌కారిడార్‌ రోడ్డుపై సీఎం సమీక్ష

  • విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి – భోగాపురం – తిరిగి ఎన్‌హెచ్‌–16కు అనుసంధానం అయ్యే బీచ్‌కారిడార్‌ రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు.
  • రోడ్డు నిర్మాణరీతుల(డిజైన్‌)పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం. 
  • ఈ బీచ్‌ కారిడార్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలవాలన్న ముఖ్యమంత్రి: సీఎం
  • విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్‌ పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకోవాలి, అలాగే ఎయిర్‌ పోర్టు నుంచి కూడా నగరానికి వీలైనంత త్వరగా రావాలి: సీఎం
  • దీంతోపాటు ఈ రహదారిని అనుకుని టూరిజం ప్రాజెక్టులు వస్తాయి: సీఎం
  • ఈనేపథ్యంలో ఈ రోడ్డుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది: సీఎం
  • ఇప్పుడున్న విమానాశ్రయంలో పౌరవిమానాలు రాకపోకలపై నిరంతరం ఆంక్షలు ఉంటున్నాయి: సీఎం
  • రాత్రి పూట ల్యాండింగ్‌ కూడా నేవీ ఆంక్షలు కారణంగా కష్టం అవుతోంది: సీఎం
  • ఇలాంటి నేపథ్యంలో బీచ్‌ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది:సీఎం

ఈ సమీక్షా సమావేశంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం శంకర నారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు,  రవాణాశాఖ కమిషనర్‌ పి సీతారామాంజనేయలు ఇతర  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


చదవండి: AP: రాష్ట్రానికి మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement