సాక్షి, హైదరాబాద్ : ఏపీలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బి.రాజశేఖర్‌ను నియమిం చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆయన వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న జి. జయలక్ష్మి మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ కాగా, ఈ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూనం మాలకొండయ్య కొనసాగుతారు.
పశుసంవర్థక శాఖలో ఉన్న జె.మురళి సహకార సొసైటీల స్పెషల్ కమిషనర్, రిజిస్ట్రారుగా బదిలీ అయ్యారు. ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. సహకార సొసైటీల స్పెషల్ కమిషనర్, రిజిస్ట్రారుగా ఉన్న ఎంవీ శేషగిరి బాబుకు సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
Published Wed, Jul 6 2016 3:01 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM
Advertisement
Advertisement