తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ | Transfer Of Many Ias In Telangana | Sakshi

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

Aug 20 2024 5:58 PM | Updated on Aug 20 2024 6:27 PM

Transfer Of Many Ias In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి, హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌గా కోట శ్రీవాత్సవ, మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ఎండీగా దాన కిషోర్, కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా చాహత్‌ బాజ్‌పేయ్‌  బదిలీ అయ్యారు.

ఆమ్రపాలి నుంచి హెచ్ఎండీఏ జాయింట్ డైరెక్టర్, మూసి రివర్ డెవలప్‌మెంట్‌ బాధ్యతలను ప్రభుత్వం తొలగించింది. మూసి రివర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు దాన కిషోర్‌కు అప్పగించింది. హెచ్ఎండిఏ పూర్తిస్థాయి బాధ్యతలను సర్ఫరాజ్ అహ్మద్‌కు అప్పగించింది. ఆయనకు హెచ్‌జీసీఎంల్‌ అదనపు భాద్యతలను కూడా అప్పగించింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా కోటా శ్రీనివాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మయాంక్ విట్టల్‌ను సర్కార్‌ బదిలీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement