రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ
కొరుక్కుపేట: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.జ్ఞానదేశికన్ విడుదల చేశారు.
కో ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రారర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్.కిర్‌లోష్ కుమార్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టరుగా బదిలీ అయ్యారు.
తిరుచిరాపల్లి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ మురళీధరన్ కో ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రారర్‌గా బదిలీ అయ్యారు.
తేనిజిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ కేఎస్‌పళనిస్వామి
తిరుచిరాపల్లి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
దిండుగల్‌జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్.వెంకటాచలం తేని జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
విరుదునగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న టిఎన్ హరిహరన్‌నున దిండుకల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు.
శివగంగై జిల్లా కలెక్టర్ వి.రాజారామన్ విరుదునగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
నాగపట్టణం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న టి.మునుసామిని శివగంగై జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.
స్కూలు ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ ప్రభుత్వ డెప్యూటీ సెక్రటరీ ఎస్.పళనిస్వామిని నాగపట్టణం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.