ఆంధ్రప్రదేశ్లో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ను సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన జేసీ శ్రీధర్ సీఆర్డీఏ కమిషనర్గా నియమించారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్‌ను విశాఖ ఈపీడీసీఎల్ సీఎండీగా బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్ యాదవ్‌ను విజయనగరం కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.