పార్వతీపురం డివిజన్‌లో ఇద్దరు ఐఏఎస్‌లు
Published Thu, Aug 29 2013 3:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
పార్వతీపురం, న్యూస్‌లైన్: ఎట్టకేలకు పార్వతీపురం డివిజన్‌లో ఇద్దరు ఐఏఎస్‌లు నియమితులయ్యారు. ఐటీడీఏ పీఓగా రంజిత్‌కుమార్‌సైనీ, సబ్ కలెక్టర్‌గా శ్వేతామహంతి నియమితులైనట్లు బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీఓగా నియమితులైన రంజిత్‌కుమార్ ఇప్పటి వరకూ వెయిటింగ్‌లో ఉంటూ పార్వతీపురం ఐటీడీఏకు బదిలీ అయ్యారు.
అలాగే సబ్‌కలెక్టర్‌గా నియమితులైన శ్వేతామహంతి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి కుమార్తె. ఈమె ఐఎఎస్ అధికారిగా శిక్షణ పూర్తిచేసుకుని తొలిసారిగా పార్వతీపురం సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక్కడ పీఓగా పనిచేస్తున్న బీఆర్ అంబేద్కర్ విశాఖపట్నం రాజీవ్ విద్యామిషన్ పీఓగా బదిలీ అయ్యారు. ఈయన పార్వతీపురం ఆర్డీఓగా పనిచేస్తూ 2012 జూలై 2న ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టి సుమారు ఏడాది పైగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆర్డీఓగా పనిచేస్తున్న జె వెంకటరావు 2012 జూలై 14న బాధ్యతలు చేపట్టి ఆయన కూడా సుమారు ఏడాది కాలం పైగానే పనిచేశారు. సుమారు దశాబ్ద కాలం తరువాత డివిజన్‌కు మళ్లీ ఇద్దరు ఐఏఎస్ అధికారులు నియమితులు కావడంతో మళ్లీ ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని ఈప్రాంతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement