
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ సెక్రటేరియట్ భద్రతను శుక్రవారం(నవంబర్ 1) నుంచి ఎస్పీఎఫ్ పోలీసులు పర్యవేక్షించనున్నారు. కొత్త సెక్రటేరియట్ ప్రారంభం నుంచి విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ బెటాలియన్ సిబ్బందిని మార్చి ఎస్పీఎఫ్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఇటీవల ఏక్ పోలీస్ నినాదంతో టీజీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఆందోళనల బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సెక్రటేరియట్ వీవీఐపీ జోన్‌లో ఉన్నందునే భద్రత నుంచి టీజీఎస్పీని ప్రభుత్వం తప్పించినట్లు తెలుస్తోంది.
గతంలో చాలాకాలం పాటు సెక్రటేరియట్ భద్రతా వ్యవహారాలను చూసిన అనుభవం ఎస్పీఎఫ్‌కు ఉంది. భద్రతా విధుల్లో చేరిన తొలిరోజు శుక్రవారం సచివాలయం ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో పూజలు చేసిన ఎస్పీఎఫ్ సిబ్బంది కవాతు నిర్వహించారు.

ఇదీ చదవండి: రాజ్‌పాకాల విచారణలో కీలక విషయాలు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment