SPF
-
సెక్రటేరియట్ సెక్యూరిటీ విధుల్లోకి టీజీఎస్పీఎఫ్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం భద్రత విధుల్లో తెలంగాణ స్పెష ల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) శుక్రవారం చేరారు. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సెక్రటేరియట్ భద్రత విధుల నుంచి టీజీఎస్పీని తప్పించి టీజీఎస్పీఎఫ్‌కి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.సచివాలయం భద్రత కోసం ప్రస్తుతం 212 మంది టీజీఎస్పీఎఫ్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధి కారులు కేటాయించారు. శుక్రవారం బాధ్యతల సందర్భంగా టీజీఎస్పీఎఫ్ సిబ్బంది సచివాల యం ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించి, కవాతు నిర్వహించారు. -
సెక్రటేరియట్ సెక్యూరిటీ విధుల్లోకి SPF సిబ్బంది
-
TG: ఎస్పీఎఫ్ పహారాలోకి సెక్రటేరియట్
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ సెక్రటేరియట్ భద్రతను శుక్రవారం(నవంబర్ 1) నుంచి ఎస్పీఎఫ్ పోలీసులు పర్యవేక్షించనున్నారు. కొత్త సెక్రటేరియట్ ప్రారంభం నుంచి విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ బెటాలియన్ సిబ్బందిని మార్చి ఎస్పీఎఫ్కు బాధ్యతలు అప్పగించారు.ఇటీవల ఏక్ పోలీస్ నినాదంతో టీజీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఆందోళనల బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సెక్రటేరియట్ వీవీఐపీ జోన్లో ఉన్నందునే భద్రత నుంచి టీజీఎస్పీని ప్రభుత్వం తప్పించినట్లు తెలుస్తోంది. గతంలో చాలాకాలం పాటు సెక్రటేరియట్ భద్రతా వ్యవహారాలను చూసిన అనుభవం ఎస్పీఎఫ్కు ఉంది. భద్రతా విధుల్లో చేరిన తొలిరోజు శుక్రవారం సచివాలయం ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో పూజలు చేసిన ఎస్పీఎఫ్ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఇదీ చదవండి: రాజ్‌పాకాల విచారణలో కీలక విషయాలు వెల్లడి -
ఎస్పీఎఫ్... డీజీపీ పరిధిలోకి వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: హోంశాఖ పరిధిలో పనిచేస్తున్నా ఆ విభాగం పోలీస్ శాఖకు దూరంగా ఉంటుంది. వాళ్లూ ఆయుధాలతో గస్తీ కాస్తున్నా రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలోకి రారు. అంతే కాదు... వాళ్లకు జోన్ల నియామకాలు, జిల్లాలవారీ బదిలీలు ఉండవు. కుటుంబాలకు దూరంగా రాష్ట్ర రాజధానితో పాటు దేవాలయాలు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రిజర్వ్ బ్యాంక్ తదితర కీలక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలకు ఆయుధాలతో భద్రత కల్పిస్తారు. అయితే ఇప్పుడు ఆ విభాగాన్ని డీజీపీ పరిధిలోకి తేవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్.. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగం పోలీస్ శాఖకు సంబంధం లేకుండా ఓ అదనపు డీజీపీ నేతృత్వంలో కార్యాలయాల భద్రతను పర్యవేక్షిస్తుంది. సుమారు 2 వేల మంది సిబ్బంది ఉన్న ఈ విభాగంలో నియామకాలు పోలీస్ రిక్రూట్మెంట్ నుంచే జరిగినా అవి జిల్లా, రేంజ్‌లు కాకుండా స్టేట్ కేడర్ (రాష్ట్ర స్థాయి) పోస్టుగా పరిగణనలోకి వస్తుంది. దీంతో ఏ జిల్లా నుంచి సెలక్ట్ అయినా రాష్ట్ర స్థాయిలో ఎక్కడకు పోస్టింగ్ వేస్తే అక్కడికి వెళ్లాల్సిందే. డీజీపీ పరిధిలోకి తీసుకురావాలని... నూతన జిల్లాలు, రేంజ్‌లు, జోన్ల ఏర్పాటు జరిగినా ఈ విభాగానికి అవి వర్తించే అవకాశాలు కనిపించడంలేదు. అయితే సిబ్బంది మాత్రం 2014లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో డీజీపీ పరిధిలోకి తెచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొత్త జోన్ల నిబంధనలు ఎస్పీఎఫ్లో అమలుకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం (హోంశాఖ) చర్యలు చేపట్టలేదు. కొత్త జోన్ల అమలు వల్ల సిబ్బంది తమ సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించే అవకాశం లభిస్తుంది. దానివల్ల మానసిక ఆందోళనలు తొలగడంతోపాటు వారి పిల్లల స్థానికత సమస్య కూడా తీరుతుందని భావించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇకపై రాష్ట్ర స్థాయి నియామకాలు ఉండవని ఉత్తర్వుల్లో ఉన్నా తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విషయంలో మాత్రం అధికారులు దీనిపై క్లారిటీ ఇవ్వడంలేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే డీజీపీ పరిధిలోకి ఈ విభాగాన్ని తేవడం వల్ల సిబ్బందితోపాటు వారి తల్లిదండ్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందేలా ఆరోగ్య భద్రత, లోన్లు కూడా అందే అవకాశం ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ కోటాలో సిబ్బంది పిల్లలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇతర శాఖల్లో డెప్యుటేషన్‌పై పనిచేసే సౌలభ్యం దొరుకుతుంది. జోన్ల ప్రకారం కేడర్ విభజన జరిగితే సిబ్బంది పిల్లలు వారి సొంత స్థానికతను పొందిన వారవుతారని ఎస్పీఎఫ్ సిబ్బంది వేడుకుంటున్నారు. మెడపై కత్తిలా కేంద్ర బలగాల డిప్యూటేషన్... ప్రాజెక్టులు, కీలకమైన కార్యాలయాలు, భవనాల భద్రతను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను ఎస్పీఎఫ్ పరిధిలోకి శాశ్వత డెప్యుటేషన్‌పై తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల ఆ విభాగంలోని సిబ్బంది పదోన్నతులతోపాటు నిరుద్యోగులకు సైతం తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బలగాల నుంచి వచ్చే సిబ్బందిని వారివారి నియామక తేదీలను బట్టి సీనియారిటీ ఖరారు చేసి రాష్ట్ర కేడర్లోనే ప్రమోషన్లు కల్పించాల్సి ఉంటుంది. ఇది అధికారులతోపాటు సిబ్బంది మెడపై కత్తిలా వేలాడే ప్రమాదముంటుందనే చర్చ జరుగుతోంది. అందుకే రాష్ట్రస్థాయి నియామకాలైన పోలీస్ కమ్యూనికేషన్, జైళ్ల శాఖల్లాగానే తమకూ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేసేలా చూడాలని సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
సాగర్‌డ్యామ్ వద్ద ఎస్పీఎఫ్ అప్రమత్తం
నాగార్జునసాగర్ : పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతవాయుసేన మెరుపుదాడులు చేసిన నేపథ్యంలో నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్) అప్రమత్తమైంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. కీలకమైన ప్రభుత్వరంగ సంస్థలపై ఉగ్రవాదులు విరుచుకుపడవచ్చనే అనుమానాలను వ్యక్తం చేసింది. గతంలో పాకిస్తాన్ టెర్రరిస్టుల వద్ద సాగర్‌డ్యామ్ ఫొటోలు లభ్యంకావడం, అలాగే హైదరాబాద్‌లో పట్టుబడిన సిమీ ఉగ్రవాది సాగర్‌వాసి కావడంతో సాగర్‌డ్యామ్ భద్రతపై స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అప్రమత్తమైంది. ప్రాజెక్టు, విద్యుదుత్పత్తి ప్లాంట్‌లో పనిచేసే ఉద్యోగులను సైతం తనిఖీ చేసిన తర్వాతనే విధుల్లోకి పంపుతున్నారు. డ్యామ్ మీదుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఆ పరిసరాల్లో ప్రతీ వాహనాన్ని పరిశీలించాకే పంపుతున్నారు. -
లెక్కిస్తానని వచ్చి నొక్కేశాడు
వేములవాడ: సేవ పేరుతో రాజన్నకు ఉచిత సేవలందిస్తానని వచ్చిన చేగుంట నారాయణ అనే వ్యక్తి హుండీ లెక్కింపులో నోట్లు నొక్కేసి ఎస్పీఎఫ్ సిబ్బందికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన బుధవారం వేములవాడ రాజన్న సన్నిధిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్‌కు చెందిన చేగుంట నారాయణను అక్కడి సత్యసాయి ట్రస్ట్ ఇన్చార్జీ వలపి బాలశేఖర్ ద్వారా హుండీ లెక్కింపులో స్వామివారి సేవ చేసేందుకు బుధవారం ఉదయం వచ్చాడు. ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ డబ్బులను చూసిన నారాయణ రూ.2 వేలనోట్లు 15, రూ.500 నోట్లు 64, ఒకటి రూ.వంద నోటు, తొమ్మిది పదిరూపాయల నోట్లు, రూ.ఇరవై నోటు ఒకదాన్ని తన నడుముకున్న లుంగీలో చుట్టేశాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వి.సురేందర్ దీనిపై కన్నేశాడు. కాసేపటి తర్వాత మూత్రవిసర్జనకు బయటికి వెళతానంటూ నారాయణ మెల్లగా నడవసాగాడు. గమనించిన సురేందర్‌కు అనుమానం పెరిగి, నారాయణను ప్రశ్నించి, పక్కనే గదిలోకి తీసుకెళ్లి తనిఖీ చేశాడు. దీంతో రూ. 62,210 నగదు దొరికింది. వెంటనే విషయాన్ని ఈవో దూస రాజేశ్వర్‌కు తెలిపారు. ఈవో వెంటనే టౌన్ సీఐ శ్రీనివాస్‌కు సమాచారం అందించడంతో ఎస్సై సైదారావు, స్పెషల్‌పార్టీ పోలీసు మనోహర్ నారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
ఆర్టీపీపీ ఉద్యోగిపై ఎస్పీఎఫ్ సిబ్బంది దాడి
ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీలో పని చేస్తున్న ఉద్యోగి దివ్యనాథ్‌ను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్( ఎస్పీఎఫ్ ) ఎస్ఐ శివతో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. డబ్బుల కోసం ఆర్టీపీపీలోని ఆంధ్రా బ్యాంక్ వద్ద బుధవారం క్యూలో నిలబడి ఉన్న ఉద్యోగుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో ఉద్యోగులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో దివ్యనాథ్ అనే ఉద్యోగిని ఎస్పీఎఫ్ సిబ్బంది లాఠీలతో చితకబాదారు. కాగా, ఎస్పీఎఫ్ ఎస్ఐ శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలమల్ల పోలీసులు దివ్యనాథ్ అనే ఉద్యోగిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వెంటనే ఉద్యోగిని విడుదల చేయాలని కోరుతూ కార్మిక, ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగి గేటును మూసి వేశారు. ఈ ఆందోళన బుధవారం రాత్రి వరకు కొనసాగింది. వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం ఉద్యోగి దివ్యనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీఎఫ్ ఎస్ఐ శివపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. దీంతో ఉద్యోగులు శాంతించారు. -
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వీరంగం
చిత్తూరు: శ్రీకాళహస్తిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ వీరంగ సృష్టించాడు. దైవ దర్శనంలో భాగంగా ఆలయానికి వచ్చిన భక్తుడు గంగాధర్ ను ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మునిప్రసాధ్ తలపై బలంగా లాఠీతో మోదాడు. దీంతో ఆ భక్తుడు సృహతప్పిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భక్తుడు గంగాధర్ స్వస్థలం అనంతపురం జిల్లా ధర్మవరం.