
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం భద్రత విధుల్లో తెలంగాణ స్పెష ల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) శుక్రవారం చేరారు. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సెక్రటేరియట్ భద్రత విధుల నుంచి టీజీఎస్పీని తప్పించి టీజీఎస్పీఎఫ్‌కి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
సచివాలయం భద్రత కోసం ప్రస్తుతం 212 మంది టీజీఎస్పీఎఫ్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధి కారులు కేటాయించారు. శుక్రవారం బాధ్యతల సందర్భంగా టీజీఎస్పీఎఫ్ సిబ్బంది సచివాల యం ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించి, కవాతు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment