సెక్యూరిటీ పిటిషన్‌ | YS Jagan Filed Petition In AP High Court Over Security | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత భద్రతపై వైఎస్‌ జగన్‌ పిటిషన్‌

Published Mon, Aug 5 2024 5:32 PM | Last Updated on Mon, Aug 5 2024 7:24 PM

YS Jagan Filed Petition In AP High Court Over Security

సాక్షి, తాడేపల్లి: వ్యక్తిగత భద్రత విషయంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. గతంలో తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్‌ జగన్‌ పిటిషన్‌లో కోరారు. అలాగే, కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించినట్టు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కాగా, తాజాగా ఏపీ హైకోర్టులో వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో తనకు ఉన్న సెక్యూరిటీ కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో వైఎస్‌ జగన్‌ కోరారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఏకపక్షంగా తనకు ఉన్న సెక్యూరిటీ తొలగించినట్టు తెలిపారు. తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, తనకు ఉన్న ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిదని తెలిపారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement