
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మౌని అమావాస్య నాడు తొక్కిసలాట చోటుచేసుకున్న దరిమిలా యూపీ ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. భక్తులకు మరింతగా భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
తొక్కిసలాట ఘటన
మహాకుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో 30మంది వరకూ మరణించారని సమాచారం. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధిక సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించడంతో పాటు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేసింది.
ప్రత్యేక రైళ్లు
కుంభమేళాకు తరలివచ్చే భక్తుల ప్రయాణ సౌకర్యం కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పుడు భక్తులకు సమర్థవంతమైన రవాణా సౌకర్యాలను అందించేందుకు తాజాగా మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
భద్రతా చర్యలు
మహాకుంభ మేళాలో భక్తుల భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్ వంటి సహాయక వ్యవస్థలు ఏర్పాటు చేశారు.
ఆరోగ్య సేవలు
మహాకుంభ మేళాలో భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్యసాయం అందించేందుకు పలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిలో వైద్యులు, నర్సులు, ఆంబులెన్సులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. భక్తులకు అవసరమైన అన్ని ఆరోగ్య సేవలు సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
రవాణా- పార్కింగ్
ప్రయాగ్‌రాజ్‌లో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. రవాణా నియంత్రణలో భాగంగా మార్గాల సూచికల బోర్డులను ఏర్పాటు చేశారు.
ఆహార సౌకర్యాలు
భక్తుల ఆహార అవసరాలను తీర్చేందుకు పలు ఫుడ్ స్టాల్స్, తాగునీటి సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రద్దీ ప్రదేశాలలో ఏర్పాటు చేసి స్టాల్స్ భక్తులకు సౌకర్యాన్ని అందించేలా రూపొందించారు.
సోషల్ మీడియా ద్వారా సమాచారం
భక్తులకు ఎప్పటికప్పుడు కుంభమేళాకు సంబంధించిన సమాచారం అందించేందుకు అధికారిక యంత్రాంగం సోషల్ మీడియా వేదికలను ఉపయోగించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కుంభమేళాకు సంబంధించిన మార్గదర్శకాలు, పరిస్థితులపై అప్‌డేట్స్ అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: ప్రభుత్వ చొరవతో తగ్గిన విమానయాన ఛార్జీలు
Comments
Please login to add a commentAdd a comment