Special train services
-
మేడారం జాతరకు 30 జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్, కాజీపేట రూరల్: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 30 జన్ సాధా రణ్ ప్రత్యేక రైళ్ల సర్విస్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్ మీదుగా సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మేడారం జాతర చేరుకోవడానికి, తిరుగు ప్రయాణానికి అత్యంత సురక్షితమైన వేగవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు ఆయా రూట్ల నుంచి నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించినట్లు అధికారులు వివరించారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ► సికింద్రాబాద్–వరంగల్, వరంగల్–సికింద్రాబాద్ మధ్య 10 రైళ్లు, సిర్పూర్కాగజ్నగర్–వరంగల్, వరంగల్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య 8 రైళ్లు, నిజామాబాద్–వరంగల్, వరంగల్–నిజామాబాద్ మధ్య 8 రైళ్లు, ఆదిలాబాద్–వరంగల్, వరంగల్–ఆదిలాబాద్ మధ్య 2 రైళ్లు, ఖమ్మం–వరంగల్, వరంగల్–ఖమ్మం మధ్య 2 రైళ్లు నడుపుతారు. ► 21 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్–వరంగల్ (07014), ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వరంగల్–సికింద్రాబాద్ (07015) ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు సాయంత్రం 6:20 గంటలకు చేరుతుంది. ► 21వ తేదీన వరంగల్–ఆదిలాబాద్ (07023) వెళ్లే ఎక్స్‌ప్రెస్ వరంగల్‌లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు ఆదిలాబాద్ చేరుతుంది. ► 22వ తేదీన ఆదిలాబాద్–వరంగల్ (07024) వెళ్లే ప్రత్యేక రైలు ఆదిలాబాద్‌లో రాత్రి 11:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12:45 గంటలకు వరంగల్ చేరుతుంది. ► 23 తేదీన ఖమ్మం–వరంగల్ (07021) వెళ్లే రైలు ఖమ్మంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి వరంగల్‌కు 12:20 గంటలకు చేరుతుంది. ► 24న వరంగల్–ఖమ్మం (07022) వెళ్లే ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55కు బయలుదేరి ఖమ్మంకి సాయంత్రం 4:30 గంటలకు చేరుతుంది. భక్తుల సౌకర్యార్ధం రైళ్లు: కిషన్‌రెడ్డి మేడారం సమ్మక్క, సారక్క జాతరకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక రైళ్లను వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్లకోసం రూ.3 కోట్లను కేటాయించింది’అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘నరేంద్రమోదీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందులో భాగంగానే.. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతర నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది’’అని ఆయన తెలిపారు. -
Indian Railways: అయోధ్యకు 1,000 రైళ్లు..
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత జనవరి 23వ తేదీ నుంచి భక్తులకు దర్శనభాగ్యం కలి్పంచనున్నారు. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్య పట్టణానికి పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు రైలు మార్గంలో అయోధ్యకు చేరేందుకు వీలుగా రైల్వే సరీ్వసులను భారీగా పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని రామాలయం ప్రారంభం అయిన రోజు నుంచి తొలి 100 రోజుల పాటు అయోధ్యకు వేయికిపైగా రైళ్లను నడిపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి. 19వ తేదీ నుంచే మొదలు! మందిర ప్రారం¿ోత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచే ఈ అదనపు రైల్వే సరీ్వసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జనవరి 19వ నుంచి ఈ అదనపు రైళ్లను నడపాలని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. 100 రోజుల పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, నాగ్‌పుర్, లక్నో, జమ్మూ, పుణె, కోల్‌కతా సహా దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల నుంచి అయోధ్యకు రైళ్లు నడపనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీటితోపాటు కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్వ్‌చేసి నడపనున్నారు. ప్రతిరోజూ ఈ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఆహారం అందించేందుకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికోసం ఈనెల 23 నుంచి రిజర్వేషన్ టికెట్ బుకింగ్‌కు అవకాశం కలి్పంచనున్నారు. అయితే దీనిపై రైల్వే శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అయోధ్యలోని రైల్వేస్టేషన్లో ఆధునికీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రోజుకు 50,000 మంది ప్రయాణికులు వచి్చనా ఎలాంటి ఇబ్బందులు పడకుండా సకల సదుపాయాలు అందుబాటులో ఉండేలా రైల్వేస్టేషన్‌ను నవీకరిస్తున్నారు. జనవరి 15వ తేదీ కల్లా స్టేషన్ పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రామ్ లల్లా ప్రతిష్టాపన క్రతువు మొదలుపెట్టి దాదాపు పది రోజుల పాటు ’ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆలయ నిర్వహణ సంస్థ ప్రత్యేకంగా ఆహా్వనించడం తెల్సిందే. మోదీతోపాటు 4,000 మంది సాధువులు, వేలాది మంది ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. -
వారానికి అయిదురోజులే
అమరావతి నుంచి పనిచేయాలంటే ఆ సౌకర్యం కల్పించండి ప్రభుత్వానికి అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల ప్రతిపాదన రాజధాని నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు సదుపాయం కావాలి హైదరాబాద్: వచ్చే జూన్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పని చేయాలంటే తమకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు. కొత్త రాజధానిలో సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం కానందున వారు కొన్ని ప్రతిపాదనలు చేశారు. వారానికి ఐదు రోజులు మాత్రమే పనిదినాలుండేలా చూడాలని కోరారు. అలా చేస్తే హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో అధికారులు, ఉద్యోగులు అక్కడికి వెళ్లకపోయినా.. తాము అధిక సమయం పనిచేయడానికి సిద్ధమన్నారు. తమ పిల్లలు హైదరాబాద్‌లోనే చదువుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగుల కుటుంబాలు రాజధానికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.కుటుంబాన్ని హైదరాబాద్‌లోనే ఉంచి తాము మాత్రం అమరావతికి వెళ్లి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. ఐదు రోజుల పనిదినాల పద్ధతి అమలు చేస్తే శని, ఆదివారాలు హైదరాబాద్‌లో తమ కుటుంబంతో గడపవచ్చని వారు యోచిస్తున్నారు. ప్రతీ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని, మళ్లీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తే ఆ రైలులో తాము వెళ్లి రావడానికి సౌకర్యంగా ఉంటుందని అధికార వర్గాలంటున్నాయి.ఇలా హైదరాబాద్‌లోనే ఉంటూ రాజధాని వెళ్లి పనిచేసే ఉద్యోగులు, అధికారులకు బ్యాచ్‌లర్ అకామిడేషన్ కల్పిస్తే సరిపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు.రెండు చోట్ల అద్దె అలవెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి హైదరాబాద్‌లోనే ప్రభుత్వ క్వార్టర్స్‌లో మరో ఏడాది పాటు ఉండేందుకు అనుమతించాలని అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
పుష్కరాలకు 200 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు మరో 200 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ గురువారం తెలిపారు. ఇదివరకు 130 రైళ్లను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాందేడ్-నిజామాబాద్ (07818) ప్రత్యేక రైలు ఈ నెల 17, 24 తేదీల్లో తెల్లవారుజామున 2 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి అదే రోజు ఉదయం 3.45కి బాసర, 4.30కి నిజామాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో నిజామాబాద్-ఆదిలాబాద్ (07819) రైలు ఈ నెల 17, 24 తేదీల్లో ఉదయం 5.30కి నిజామాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11కి ఆదిలాబాద్ చేరుతుంది. ఆదిలాబాద్-నిజామాబాద్ (07820) ప్రత్యేక రైలు తిరిగి అదేరోజు మధ్యాహ్నం 12.30కి ఆదిలాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 5.28కి బాసర, 6.15కి నిజామాబాద్ చేరుతుంది. నిజామాబాద్-నాందేడ్ (07821) సాయంత్రం 7.50కి నిజామాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 8.28కి బాసర, 10.30కి నాందేడ్ చేరుతుంది. నాందేడ్-నిజామాబాద్-ఆదిలాబాద్ (07822/07823) స్పెషల్ ట్రైన్ ఈ నెల 18, 25 తేదీల్లో రాత్రి 11కి నాందేడ్ నుంచి బయలుదేరి రాత్రి 12.47కి బాసరకు, తెల్లవారు జామున 1.30కి నిజామాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తెల్లవారు జామున 2కి నిజామాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 3.15కి బాసరకు, 8.30కి ఆదిలాబాద్ చేరుతుంది. ఆదిలాబాద్-నిజామాబాద్-నాందేడ్ (07824/07825) స్పెషల్ ట్రైన్ ఈ నెల 18, 25 తేదీల్లో ఉదయం 10కి ఆదిలాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.25కి బాసరకు, సాయంత్రం 3.15కి నిజామాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.15కి నిజామాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 7కి నాందేడ్‌కు చేరుతుంది. సికింద్రాబాద్-భద్రాచలం (07828/07829) స్పెషల్ ట్రైన్ ఈ నెల 19, 26 తేదీల్లో ఉదయం 11కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 5కి భద్రాచలం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 27 తేదీల్లో సాయంత్రం 4.30కి భద్రాచలం నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 10.30కి సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్-మంచిర్యాల (07830/07831) ఈ నెల 13 నుంచి 26 వరకు ఉదయం 4.45కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 10కి మంచిర్యాల చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ నుంచి 26 వరకు సాయంత్రం 5.45కి మంచిర్యాల నుంచి బయలుదేరి రాత్రి 11.15కి సికింద్రాబాద్ చేరుతుంది. మంచిర్యాల-కాజీపేట్ (07832/07833) ఈ నెల 13 నుంచి 26 వరకు ఉదయం 11.10కి మంచిర్యాల నుంచి బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 1.40కి కాజీపేట్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.10 కి కాజీపేట్ నుంచి బయలుదేరి సాయంత్రం 4.45కి మంచిర్యాల చేరుతుంది.