సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 2+2 ఉన్న భద్రతను 4+4గా పెంచుతూ అన్ని జిల్లా అధికారులకు ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ ఆదేశాలు జారీ చేశారు.పెంచిత భద్రత నిన్నటి నుంచి రిపోర్ట్ చేయాలని సర్కులర్ లో పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంపు పై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు కూడా భద్రత పెంచాలని విపక్ష పార్టీల పలువురు ఎమ్మేల్యేలు, నాయకులు డీజీపీకి విజ్ఞప్తి చేసుకున్నారు. విపక్ష నేతల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోలేదని ఎన్నికల సంఘానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలి: సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment