TS:మాజీ సీఎం కేసీఆర్‌ భద్రత.. ప్రభుత్వ కీలక నిర్ణయం | Security Reduced To Former CM KCR | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కేసీఆర్‌ భద్రత.. ప్రభుత్వ కీలక నిర్ణయం

Published Fri, Dec 15 2023 10:42 AM | Last Updated on Fri, Dec 15 2023 10:58 AM

Security Reduced To Former Cm Kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు జెడ్‌ ప్లస్‌ కేటగిరిలో ఉన్న కేసీఆర్‌ భద్రతను వై కేటగిరీకి కుదించారు. 4+4 గన్‌మెన్‌లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని మాత్రమే కేసీఆర్‌ భద్రత కోసం కేటాయించనున్నారు. ఇంటి ముందు సెంట్రీ పహారా ఉంచనున్నారు. 

ఇప్పటికే మాజీ మంత్రులకు భద్రత తగ్గించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులకు మాత్రం 2+2 గన్‌మెన్‌లను ఉంచి ఎమ్మెల్యేగా లేని వారికి గన్‌మెన్‌లను పూర్తిగా తొలగించారు. ఇక  మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌లకు ఉన్న గన్‌మెన్లను తొలగించారు. 

ఇదీచదవండి..ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement